దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2026 - 4:57 IST
Published By : Hashtagu Telugu Desk
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ మధ్య ప్రేమాయణం మరోసారి బహిర్గతమైంది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట, స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) 2026 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని స్పష్టం చేసే కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
-
- ట్రూడో ప్రసంగానికి మద్దతుగా హాజరైన పాప్ సింగర్
- దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరంలో జంటగా కనిపించిన ట్రూడో, కేటీ పెర్రీ
- వేదికపై నుంచి కేటీని చూసి కన్నుగీటిన మాజీ ప్రధాని
- ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న వీరి రొమాంటిక్ వీడియో
passing the signals to each other in middle of conference.. oh they are in LOVE😭 pic.twitter.com/vREWX8lWPX
— kanishk (@kaxishk) January 21, 2026
ఈ సదస్సులో భాగంగా జరిగిన ‘గ్లోబల్ సాఫ్ట్ పవర్ సమ్మిట్’లో జస్టిన్ ట్రూడో ప్రసంగిస్తుండగా, కేటీ పెర్రీ అనూహ్యంగా ‘ఫీమేల్ కోషెంట్ లాంజ్’లోకి ప్రవేశించి ఆయనకు తన మద్దతు తెలిపారు. ట్రూడో వేదికపై నుంచి ప్రసంగిస్తూ కేటీ పెర్రీని చూసి కన్నుగీటారు. ప్రతిగా ఆమె కూడా నవ్వుతూ ఆయనకు సైగ చేయడం అక్కడి కెమెరాల్లో రికార్డయింది.
ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ వేదికపై వీరిద్దరి మధ్య జరిగిన ఈ రొమాంటిక్ మూమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొన్ని రోజులుగా ఈ జంట బయట కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండగా, ఇప్పుడు దావోస్ వేదికగా వీరి బంధం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.