విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపితే కేవలం 3 కేటగిరీలే (A, B, C) మిగులుతాయి.
- Author : Gopichand
Date : 20-01-2026 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI Central Contract: టీమ్ ఇండియా హెడ్ కోచ్ భారత క్రికెట్‌లో ‘సూపర్‌స్టార్ కల్చర్’ను అంతం చేయాలని ఎప్పుడూ చెబుతుంటారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు చేయాలని సిఫార్సు చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. అగార్కర్ A+ కేటగిరీని తొలగించాలని కోరుకుంటున్నారు.
ఇప్పుడు కేవలం 3 కేటగిరీలే ఉంటాయా?
వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపితే కేవలం 3 కేటగిరీలే (A, B, C) మిగులుతాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా A+ కేటగిరీలో ఉన్నారు. ఈ A+ కాంట్రాక్ట్ విలువ రూ. 7 కోట్లు. గ్రేడ్ A, B, C ఆటగాళ్లకు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటి లభిస్తాయి.
Also Read: 3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు
‘Ro-Ko’ స్టార్‌డమ్ ముగిసిపోతుందా?
ఒకవేళ ప్రతిపాదిత మోడల్‌కు ఆమోదం లభిస్తే భారత వన్-ఫార్మాట్ ప్లేయర్స్ అయిన రోహిత్, కోహ్లీలను కేటగిరీ Bలో ఉంచే అవకాశం ఉంది. అయితే ప్రతి కేటగిరీ ఫీజు ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ పరిణామాలన్నీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకే జరుగుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే ఆయన టీమ్ ఇండియాలో ‘సూపర్‌స్టార్ కల్చర్’ను రూపుమాపాలని గట్టిగా కోరుకుంటున్నారు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్ పూర్తి జాబితా (2024-25)
- గ్రేడ్ A+: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
- గ్రేడ్ A: మహమ్మద్ సిరాజ్, కె.ఎల్. రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్.
- గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్.
- గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శామ్సన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.