HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Former England Captain Passes Away

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌.. కెరీర్‌లో 2548 వికెట్లు!

గిఫోర్డ్ 1964- 1965లో వోర్సెస్టర్‌షైర్ కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1960 నుండి 1988 మధ్య ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఒక బౌలర్‌గా ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.

  • Author : Gopi Date : 21-01-2026 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former England Captain
Former England Captain

Former England Captain: జనవరి 22 నుండి శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సిద్ధమవుతున్న వేళ ఆ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నార్మన్ గిఫోర్డ్ కన్నుమూశారు. 85 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. నార్మన్ గిఫోర్డ్ 1964 నుండి 1973 వరకు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లే ఆడినప్పటికీ దేశీయ క్రికెట్‌లో అసాధారణ రికార్డులను సృష్టించారు. విశేషమేమిటంటే ఆయన తన 44 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

కెరీర్‌లో 2548 వికెట్లు

గిఫోర్డ్ 1964- 1965లో వోర్సెస్టర్‌షైర్ కౌంటీ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1960 నుండి 1988 మధ్య ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఒక బౌలర్‌గా ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.

Also Read: భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?

  • టెస్ట్ క్రికెట్: 15 మ్యాచ్‌లలో 33 వికెట్లు.
  • వన్డే క్రికెట్: 3 మ్యాచ్‌లలో 4 వికెట్లు.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్: 710 మ్యాచ్‌లలో 2068 వికెట్లు.
  • లిస్ట్-A క్రికెట్: 443 వికెట్లు. మొత్తంగా అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కలిపి ఆయన 2548 వికెట్లు పడగొట్టారు.

పాకిస్థాన్‌పై కెప్టెన్‌గా

44 ఏళ్ల వయసులో షార్జాలో జరిగిన ‘రోత్మన్ ఫోర్-నేషన్స్ కప్’లో రెండు వన్డే మ్యాచ్‌లకు ఆయన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆయన అద్భుతంగా బౌలింగ్ చేసి, 10 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. టెస్ట్ క్రికెట్‌లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌పై 55 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1975లో ‘విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు. 1978లో MBE గౌరవాన్ని అందుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • england
  • Former England captain
  • Norman Gifford
  • sports news

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd