HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Is Mimicking Arshdeep Singhs Running Style

నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!

కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.

  • Author : Gopi Date : 10-01-2026 - 5:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

Virat Kohli: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో వడోదరలో జరుగుతున్న నేషనల్ క్యాంప్‌కు భారత బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా ఉల్లాసంగా, మంచి జోష్‌లో హాజరయ్యారు. ప్రాక్టీస్ సెషన్ల మధ్య కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా గడుపుతూ టీమ్ వాతావరణాన్ని సందడిగా మార్చేశారు.

అర్ష్‌దీప్‌ను ఇమిటేట్ చేసిన విరాట్

నెట్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కాసేపు ఎంటర్‌టైనర్‌గా మారిపోయారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయడానికి వస్తుండగా కోహ్లీ సరదాగా అతని రన్-అప్‌ను అనుకరించారు (మిమిక్రీ చేశారు). అర్ష్‌దీప్ వేసే అడుగులు, అతని బాడీ లాంగ్వేజ్‌ను కోహ్లీ కామిక్ స్టైల్‌లో చేసి చూపించడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. కోహ్లీ చేసిన ఈ అల్లరితో ప్రాక్టీస్ సెషన్‌లోని సీరియస్‌నెస్ కాస్త తగ్గి, వాతావరణం తేలికపడింది.

Virat Kohli is mimicking Arshdeep Singh’s running style 😂❤️ pic.twitter.com/RbobLlmn5S

— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 9, 2026

నవ్వు ఆపుకోలేకపోయిన రోహిత్ శర్మ

కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది. వీరిద్దరూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ చాలా రిలాక్స్‌డ్‌గా కనిపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

అద్భుతమైన ఫామ్‌లో ‘కింగ్’ కోహ్లీ

విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ 3 మ్యాచ్‌ల్లో 151 సగటుతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన ఐసీసీ (ICC) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arshdeep Singh
  • Ind vs NZ
  • Mimicking
  • rohit sharma
  • sports news
  • virat kohli

Related News

    Latest News

    • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

    • CEEW : జియోథర్మల్ ఎనర్జీ – ఏపీ, తెలంగాణ సహా కీలక రాష్ట్రాల్లో భారీ అవకాశాలు

    • Survival : సంపూర్ణ ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యంగా ‘రికవరీ వన్ 2026’

    • Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

    • Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

    Trending News

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd