T20 World Cup: డ్రెస్సింగ్ రూములో బోరున విలపించిన రోహిత్ శర్మ..ఓదార్చిన తోటి ఆటగాళ్లు.!!
- By hashtagu Published Date - 10:43 AM, Sat - 12 November 22

టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. ఇంగ్లండ్ పై ఓటమితో భారత జట్టు కథ సమాప్తం అయ్యింది. మెల్ బోర్న్ మైదానంలో ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూములో బోరున విలపించాడు. తోటి ఆటగాళ్లంతా రోహిత్ ను ఓదార్చారు.
ఇంగ్లండ్ తో జరిగిన సెమీ పైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ తన దు:ఖాన్ని అదుపుచేసుకోలేకపోయారు. బోరున విలపిస్తూ కనిపించాడు. తన డ్రెస్సింగ్ రూమ్ లో వెక్కి వెక్కి ఏడ్చాడు. రోహిత్ ను తోటి ఆటగాళ్లంతా ఓదార్చారు. అయితే ఆ తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు కెప్టెన్ రోహిత్ తోటిఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించాడు. కాగా జట్టు కష్టపడి పనిచేసినంుదకు ప్రతిఒక్కరూ గర్వపడాలని రాహుల్ ద్రవిడ్ అన్నారు. రోహిత్ మంచి ఆటతీరు కనబరిచారని…భారత జట్టు ఓడిపోయిందంటే నమ్మలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. రోహిత్ ఇంత ఉద్వేగానికి లోనవడం గతంలో చూడలేదన్నారు. తమ శాయాశక్తుల పోరాడిన రిజర్వ్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూలకు టీం మేనేజ్ మెంట్ ధన్యవాదాలు తెలిపింది.