Shame on MI: ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్.. ‘Shame on MI’ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్..!
రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించడంతో అతడి ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ (Shame on MI)కు చుక్కలు చూపిస్తున్నారు.
- By Gopichand Published Date - 11:58 AM, Sat - 16 December 23

Shame on MI: రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించడంతో అతడి ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ (Shame on MI)కు చుక్కలు చూపిస్తున్నారు. శుక్రవారం ప్రకటన వచ్చినప్పటి నుంచి X (ట్విటర్)లో 4 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ లో 2 లక్షల మందికి పైగా అన్ ఫాలో చేశారు. దీంతో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీగా చెన్నై (13 మిలియన్లు) అవతరించింది. రోహిత్ శర్మ లేకుంటే ముంబై బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోతుందని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.
‘ShameOnMI’ ట్వీట్లు
రోహిత్ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు కనీస గౌరవం ఇవ్వలేదని, అకస్మాత్తుగా తొలగించారని ఫైరవుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో ముంబై జెర్సీలను కాల్చివేస్తున్నారు. ఇన్ని రోజులు రోహిత్ శర్మపై ఇష్టంతోనే ముంబై ఇండియన్స్ ను సపోర్ట్ చేశామని, ఇక నుంచి పట్టించుకోమని పోస్టులు చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆ జట్టు ట్విటర్ హ్యాండిల్ ను ఏకంగా 4లక్షల మంది అన్ ఫాలో చేశారు. అలాగే ‘ShameOnMI’ హ్యాష్ ట్యాగ్ ట్వీట్లు చేస్తున్నారు. రోహిత్ ముంబై జట్టు కోసం ఎంతో చేశాడని, కానీ ఆ జట్టు యాజమాన్యం రోహిత్ విషయంలో తప్పు చేసిందని మండిపడుతున్నారు.
Also Read: Chetan Sakariya: టీమిండియా యువ బౌలర్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
తన కెప్టెన్సీలో గత పదేళ్లలో ముంబై ఇండియన్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా మార్చిన రోహిత్ శర్మ.. అకస్మాత్తుగా కెప్టెన్సీని కోల్పోతాడని అనుకోకపోవచ్చు. హార్దిక్ పాండ్యాకు అకస్మాత్తుగా కెప్టెన్సీ అప్పగించారు. ఇది ఫ్రాంచైజీ మద్దతుదారులకు, రోహిత్ శర్మ అభిమానులకు కోపం తెప్పించింది. దింతో ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేకంగా అనేక స్పందనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ లేదా ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ పాండ్యా ఇంతవరకు స్పందించలేదు. సోషల్ మీడియాలో యుద్ధ వాతావరణం నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.