HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit To Drop Pant Indias Probable Xi For 5th Test Vs Australia

India’s Probable XI: ఆసీస్‌తో ఐదో టెస్టు.. ఈ ఇద్దరు ఆటగాళ్లపై వేటు?

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు.

  • Author : Gopichand Date : 02-01-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India's Probable XI
India's Probable XI

India’s Probable XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ పరంగా ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు (India’s Probable XI) చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా WTC రేసులో కొనసాగుతుంది. 2025లో టీమిండియాకు సిడ్నీ టెస్టు తొలి టెస్టు మ్యాచ్ కానుంది. ఇప్పుడు టీమిండియా కీల‌క‌ ఆటగాడు కొత్త ఏడాది తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవ‌కాశం ఉంది. ఇప్పటివరకు ఈ ఆటగాడు సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడుతూ కనిపించాడు.

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు సిరాజ్ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లో ఆడాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ 4 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ మ్యాచ్ సమయంలో జస్ప్రీత్ బుమ్రాకు సిరాజ్ నుండి తగినంత మద్దతు లభించలేదు. దీంతో సిడ్నీ టెస్టుకు సిరాజ్ దూర‌మ‌య్యే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది.

Also Read: Chandrababu : నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని కలిసిన సీఎం చంద్రబాబు

సిడ్నీ టెస్టు నుంచి మహ్మద్ సిరాజ్‌ను తప్పించినట్లయితే అతని స్థానంలో ప్రసిద్ కృష్ణకు అవకాశం లభించవచ్చు. ఇప్పటి వరకు ప్రసిద్ధ్ కృష్ణకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు 2025లో జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రసిద్‌కు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌కు ముందు ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రసిద్ రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 10 వికెట్లు పడగొట్టాడు.

రిషబ్‌ పంత్‌పై వేటు?

బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఐదో టెస్టు సిడ్నీ వేదిక‌గా జ‌న‌వ‌రి 3న ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ముందు టీమిండియాలో మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న రిష‌బ్ పంత్‌ను ఐదో టెస్టుకు ప‌క్క‌న పెట్ట‌నున్నారు. పంత్‌ను పక్కన పెట్టి ధ్రువ్‌ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • BCCI
  • Border-Gavaskar Trophy
  • cricket
  • IND vs AUS
  • india
  • pant
  • rohit sharma
  • siraj
  • sports news
  • TeamIndia

Related News

Icc T20 World Cup 2026

నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం..

ICC T20 World Cup 2026  భారత్, పాక్ మ్యాచ్‌లతో ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026 ఇవాళ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. తొలి రోజు గ్రూప్ – ఏలోని నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్ పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్ భారత్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ఉదయం 11 గంటలకు పాక్ – నెదర్లాండ్స్ మ్యాచ్, రాత్రి 7 గంటలకు భారత్ […]

  • U19 World Cup 2026

    అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

  • T20 World Cup 2026

    టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

  • World Cup Final Score

    అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. భార‌త్ భారీ స్కోర్‌!

  • World Cup Final Score

    అండర్ 19 వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌.. విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!

Latest News

  • రైతు భరోసా వారికీ మాత్రమే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

  • కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI

  • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

  • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

Trending News

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd