HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ntr Statue Unveiling At Ameerpet Crossroads In Hyderabad Today

NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Author : Prasad Date : 28-05-2026 - 8:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Statue Ammerpet
Ntr Statue Ammerpet

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌రుకానున్నారు. ఇటు టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరుకానున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమీర్ పేట చౌర‌స్తాలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తాన‌ని హ‌మీ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ భారీ మెజార్టీతో గెల‌వ‌డంతో ఇచ్చిన హ‌మీని రేవంత్ రెడ్డి నేర‌వేరుస్తున్నారు.

ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని నిర్వాహకులు పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నివాళి సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో అమీర్‌పేట్ పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఎన్టీఆర్ చిత్రాలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.ళ‌అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులు మహానేతను స్మరించుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ammerpet
  • CM Revanth Reddy
  • congress
  • hyderabad
  • ntr
  • NTR birth anniversary
  • ntr statue
  • tdp

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd