Rohit Sharma: యశస్వి జైస్వాల్ తొలి టెస్ట్ సక్సెస్ వెనక రోహిత్ శర్మ..!
యశస్వి జైస్వాల్ ప్రస్తుతం 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. జైస్వాల్ ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అందించాడు.
- By Gopichand Published Date - 02:24 PM, Fri - 14 July 23

Rohit Sharma: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ మరింత పటిష్టంగా మారింది. భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపిన ఘనత అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కే దక్కుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం సాధించింది. యశస్వి జైస్వాల్ ప్రస్తుతం 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. జైస్వాల్ ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు అందించాడు.
తొలి టెస్టులో రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్‌కు ఓపెనర్ అవకాశం లభించింది. అంతే కాకుండా చాలా కాలం తర్వాత భారత ఓపెనర్లిద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశారు. తన విజయ రహస్యాన్ని జైస్వాల్ వెల్లడిస్తూ.. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ భయ్యాతో చాలా మాట్లాడాను. ఈ వికెట్‌పై ఎలాంటి బ్యాటింగ్ చేయవచ్చో రోహిత్ భయ్యా నిరంతరం వివరించాడని పేర్కొన్నాడు.
జైస్వాల్ ఇంకా మాట్లాడుతూ.. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా రోహిత్ భాయ్ నాతో నిరంతరం మాట్లాడేవాడు. నువ్వు పెద్ద స్కోర్ చేసి చూపించాలి అని చెప్పేవాడు. నువ్వు చేయగలవు. నేను కూడా దీని గురించే ఆలోచిస్తున్నాను. ఈ గేమ్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. టీమ్ ఇండియా కోసం పరుగులు చేయడం నా ప్రయత్నం అని చెప్పుకొచ్చాడు.
Also Read: Virat Kohli Video: 81 బంతుల్లో ఒకే ఒక బౌండరీ.. అయినా కోహ్లీ సెలబ్రేషన్స్
రోహిత్ కూడా సెంచరీ చేశాడు
రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు వెస్టిండీస్‌ను భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 162 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపిన ఘనత కూడా కెప్టెన్ రోహిత్ శర్మదే. రోహిత్ శర్మ 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతే కాదు జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో రోజు స్కోరు పెంచి వెస్టిండీస్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు ఆహ్వానించాలని టీమ్ ఇండియా చూస్తుంది.