Rohit Sharma Effect: రోహిత్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు మరీ.. ముంబైకి 13 లక్షల మంది అభిమానులు షాక్..!
లక్షలాది మంది రోహిత్ ఫ్యాన్స్ (Rohit Sharma Effect) ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
- By Gopichand Published Date - 08:12 AM, Sun - 17 December 23

Rohit Sharma Effect: లక్షలాది మంది రోహిత్ ఫ్యాన్స్ (Rohit Sharma Effect) ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటివరకు 8 లక్షల మంది ముంబైని అన్ ఫాలో చేశారు. రోహిత్ కెప్టెన్సీ తొలగింపుపై ప్రకటన రాకముందు ఇన్స్టాలో ముంబైకి 13.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు 12.5 మిలియన్లకు తగ్గారు. మరోవైపు ట్విటర్ లో దాదాపు 5 లక్షల మంది అన్ ఫాలో చేశారు. రెండు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కలిపి 13 లక్షల మంది ముంబైకి షాకిచ్చారు.
ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తదుపరి ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్‌గా నియమించింది. ఈ నిర్ణయం అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కొద్ది రోజుల క్రితమే హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ట్రేడ్ చేసింది. రోహిత్ శర్మ 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని చేపట్టాడు. ఆ తర్వాత రోహిత్ తన జట్టుకు ఐదు IPL టైటిళ్లను అందించాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలోనే ముంబై ఐపీఎల్ ట్రోఫీలన్నీ గెలుచుకుంది. ఎంఎస్ ధోనితో కలిసి ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. MS ధోని తన 14 సంవత్సరాల నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు IPL టైటిల్స్ అందించాడు.
Also Read: Mumbai Captain: ముంబై కెప్టెన్ విషయంలో బిగ్ ట్విస్ట్..? ఈ విషయం రోహిత్ శర్మకు ముందే తెలుసా..?
A drop of 1 Million followers😳😳
MUMBAI INDIANS#RohitSharma𓃵 #ShameOnMI #SuryakumarYadav @mipaltan #shameonmumbaiindians#RohitSharma #HardikPandya
Bumrah #MumbaiIndians #ViratKohli #IPL2024 #MSDhoni #abhiyaLike ❤️ Retweet 🔄 pic.twitter.com/kPjcDMxoa9
— Socialist Spirit (@SocialistSpirit) December 17, 2023
క్రిక్‌ట్రాకర్ నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన తర్వాత ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. రాబోయే సీజన్‌లో రోహిత్ శర్మ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాలని కోరుకునే ముంబై అభిమానులకు ముంబై తీసుకున్న నిర్ణయం నచ్చలేదు. దింతో అభిమానులు నిరసనగా MI సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేయడం ప్రారంభించారు.
ముంబై ఇండియన్స్ ట్విట్టర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో చేశారు. 2013లో MI లీగ్ మ్యాచ్‌లలో అనేక పరాజయాల తర్వాత సీజన్ మధ్యలో రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు. రోహిత్.. రికీ పాంటింగ్ నుండి ఈ బాధ్యత తీసుకున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన మొదటి సీజన్‌లోనే ఫ్రాంచైజీ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు హిట్ మ్యాన్.
We’re now on WhatsApp. Click to Join.
అప్పటి నుండి ముంబై ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు, ఎనిమిదేళ్లలో ఐదు టైటిళ్లను గెలుచుకుంది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా అవతరించింది. ఎంఎస్ ధోని సారథ్యంలోని సీఎస్‌కే పోయినసారి టైటిల్ గెలిచి ముంబైని సమం చేసింది. అందుకే రోహిత్ తన కెప్టెన్సీని మరొకరికి అప్పగించే రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత సీజన్‌లో ధోనీ చేసినట్లే. అతనే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసాడు.కానీ మధ్యలో జడేజా కెప్టెన్సీని ధోనీకి తిరిగి ఇచ్చాడు.