HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Celebrates 15 Historic Years With Mumbai Indians

ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) టైటిల్ నెగ్గడంలో రోహిత్ కెప్టెన్సీ కీలకంగా నిలిచింది. అలాగే 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

  • Author : Gopi Date : 11-04-2026 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో తన టైటిల్ నిరీక్షణకు తెరదించాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఆ ఫ్రాంచైజీ ఒక ప్రత్యేక సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ముంబై రికార్డ్ బ్రేకింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 10, 2011న ముంబై ఇండియన్స్ (MI) తరపున అరంగేట్రం చేసిన రోహిత్.. ఇప్పుడు ఈ జట్టుతో తన 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

రోహిత్‌కు హార్దిక్ పాండ్యా గౌరవం

ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహచర ఆటగాడు రోహిత్‌కు ప్రత్యేక గౌరవాన్ని అందించారు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో హార్దిక్ ఇలా అన్నారు. భాయ్, 15 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ఈ ఫ్రాంచైజీని అద్భుతంగా నడిపించినందుకు ధన్యవాదాలు. నేను మీ నాయకత్వంలోనే డెబ్యూ చేశాను. బుమ్రా, ఇతర ఆటగాళ్లు కూడా మీ హయాంలోనే జట్టులోకి వచ్చారు అని పేర్కొన్నాడు.

Also Read: హోర్ముజ్ జలసంధి.. అమెరికా సంచ‌ల‌న వాద‌న‌!

Moment hai bhai, moment hai! 💙 pic.twitter.com/FjAQfOMofY

— Mumbai Indians (@mipaltan) April 11, 2026

హార్దిక్ ఇంకా మాట్లాడుతూ.. ఈ ఫ్రాంచైజీకి, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది ఆటగాళ్లను ఇన్‌స్పైర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు కేవలం ఒక లీడర్‌గానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ, ఓపెన్ మైండెడ్‌గా ఉంటూ జట్టును ముందుండి నడిపించారు. గత కొన్నేళ్లుగా మీరు చేసిన కృషికి చాలా థాంక్స్ అని పేర్కొన్నారు.

15 ఏళ్ల అద్భుత ప్రయాణం

38 ఏళ్ల రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో తన జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన ఇద్దరు కెప్టెన్లలో ఒకరు. 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోహిత్ 2011లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ కోసం 230 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 5994 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) టైటిల్ నెగ్గడంలో రోహిత్ కెప్టెన్సీ కీలకంగా నిలిచింది. అలాగే 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఈ సీజన్ (2026)లో ఐపీఎల్ టైటిల్ గెలిస్తే టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలుస్తాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 39.33 సగటుతో, 168.57 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు. ఇప్పటికే ఆయన ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 15 Years of Rohit
  • Five IPL Titles
  • Hardik Pandya
  • Hitman Legacy
  • IPL 2026
  • IPL Records
  • Jasprit Bumrah
  • MI Captaincy
  • mumbai indians
  • Mumbai Indians News
  • rohit sharma
  • sachin tendulkar

Related News

Rohit Sharma x MS Dhoni at Chepauk

IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?

ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవక

  • 2007, 2024, 2026 MS Dhoni, Suryakumar Yadav and Rohit Sharma together T20 world cup capitans

    T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

  • Bhuvneshwar Kumar on holding the Purple Cap

    Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

  • Vaibhav Suryavanshi

    ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

  • Riyan Parag

    ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

Latest News

  • DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !

  • Gujarat university : మోదీ గురించి పాఠం..విద్యార్థులకు గొప్ప అనుభూతి !!

  • Sreeleela : శ్రీలీల కోరిక అదేనట !!

  • Flight : విమానం నుండే దూకేసిన వ్యక్తి

  • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd