RCB Vs PBKS: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్‌లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి.
- By Gopichand Published Date - 12:40 AM, Sat - 19 April 25

RCB Vs PBKS: ఐపీఎల్ పుట్టినరోజు సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 14 ఓవర్ల మ్యాచ్‌లో ఆర్‌సీబీ (RCB Vs PBKS) 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోసారి ఆర్‌సీబీ హోం గ్రౌండ్‌లో గెలవలేకపోయింది. ఆర్‌సీబీ మొదట ఆడి 95 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. పంజాబ్ తరఫున మొదట బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో నేహల్ వధేరా 19 బంతుల్లో నాటౌట్ 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంది.
14 ఓవర్లలో 96 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం అంత మంచిగాలేదు. మూడో ఓవర్‌లో 22 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత నియమిత వ్యవధిలో వికెట్లు పడుతూ వచ్చాయి. ప్రభసిమ్రన్ సింగ్ 9 బంతుల్లో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ప్రియాంశ్ ఆర్య 11 బంతుల్లో 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 10 బంతుల్లో 7 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ ఇంగ్లిస్ 14 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
Also Read: GST On UPI transactions: రూ. 2వేలకు మించిన యూపీఐ పేమెంట్స్‌పై జీఎస్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే?
8 ఓవర్లలో 53 పరుగుల వద్ద 4 వికెట్లు పడినప్పుడు ఆర్‌సీబీ మ్యాచ్‌ను తిప్పివేస్తుందని అనిపించింది. కానీ నేహల్ వధేరా కౌంటర్ అటాక్ చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. నేహల్ 19 బంతుల్లో నాటౌట్ 33 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుండి 3 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి.
ఇదిలా ఉండగా వర్షం పడటంతో 14 ఓవర్ల మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభం అంత బాగలేదు. ఫిల్ సాల్ట్ మొదటి ఓవర్‌లోనే 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అతన్ని అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అర్షదీప్ విరాట్ కోహ్లీని కూడా ఔట్ చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఇద్దరు ఓపెనర్లు ఔటైన తర్వాత అందరి ఆశలు రజత్ పాటీదార్‌పై ఉన్నాయి. అతను వచ్చీరాగానే ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు. కానీ మరోవైపు వికెట్లు క్రమం తప్పకుండా పడుతూ వచ్చాయి. మొదట లియామ్ లివింగ్‌స్టోన్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జితేష్ శర్మ కేవలం రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్‌సీబీ నియమిత వ్యవధిలో వికెట్లను కోల్పోయింది.
పాటీదార్ 18 బంతుల్లో 23 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మనోజ్ భాండగే వచ్చాడు. కానీ అతను కూడా ఏమీ చేయలేక ఒక పరుగు చేసి ఔటయ్యాడు. టిమ్ డేవిడ్ కొన్ని బిగ్ షాట్స్ ఆడి ఐపీఎల్‌లో తన మొదటి అర్ధసెంచరీ సాధించాడు. అతను చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. అతని బ్యాట్ నుండి 5 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. పంజాబ్ కింగ్స్ తరఫున అర్షదీప్ సింగ్, హరప్రీత్ బరార్, యుజవేంద్ర చాహల్, మార్కో యాన్సెన్ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీశారు.