CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 11:53 PM, Fri - 28 March 25

CSK vs RCB: ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసింది. దీనికి బదులుగా చెన్నై జట్టు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో చెన్నైకి ఇది తొలి ఓటమి. దీనికి ముందు వారు ముంబై ఇండియన్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2008 తర్వాత చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ.. సీఎస్‌కేను ఓడించడం ఇదే తొలిసారి.
Also Read: Nitish Kumar Reddy: హెల్మెట్ విసిరేసిన సన్‌రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
17 ఏళ్ల తర్వాత బెంగళూరు విజయం
చెపాక్ స్టేడియం చెన్నై సూపర్ కింగ్స్‌కు బలమైన ప్రదేశం. ఇక్కడ RCB చివరిసారిగా 2008లో చెన్నైని ఓడించింది. ఆ మ్యాచ్‌లో బెంగళూరు చెన్నైపై 14 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత రెండు జట్లు చెపాక్ మైదానంలో 8 సార్లు తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ ప్రతిసారీ గెలిచింది. ఇప్పుడు చివరకు చెపాక్ స్టేడియంలో CSK పై వరుసగా 8 పరాజయాల పరంపరకు RCB ముగింపు పలికింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఇది సాధ్యమైంది.
ఆర్సీబీ వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది వరుసగా రెండో విజయం. అంతకుముందు ఆర్సీబీ టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు టేబుల్ టాపర్‌గా నిలిచింది.