Nitish Kumar Reddy: హెల్మెట్ విసిరేసిన సన్‌రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి కోపం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- By Gopichand Published Date - 12:53 PM, Fri - 28 March 25

Nitish Kumar Reddy: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కోపం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 190 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్నో జట్టు 16.1 ఓవర్లలో 193 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగ్ సమయంలో నితీష్ రెడ్డి ఔట్ అయిన తర్వాత కోపంతో హెల్మెట్‌ను విసిరిన సంఘటన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
@itshitmanera pic.twitter.com/hO1xv3e6Qc
— Follow @itshitmanera (@Itshitmanera45) March 27, 2025
మొదట బ్యాటింగ్ చేసిన SRH ఆరంభంలోనే కుదేలైంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు 15 పరుగులకే ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (47)తో నితీష్ రెడ్డి భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. అయితే హెడ్ ఔట్ కాగా హెన్రిచ్ క్లాసెన్ కూడా తక్కువ స్కోర్‌కేక వెనుదిరిగాడు. ఈ ఒత్తిడిలో నితీష్ రెడ్డి (28 బంతుల్లో 32, 2 ఫోర్లు) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ రవి బిష్ణోయ్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పెవిలియన్‌కు చేరే సమయంలో నిరాశతో హెల్మెట్‌ను మెట్లపై విసిరేశాడు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
Also Read: Health Tips: రాత్రిపూట తరచూ టాయిలెట్‌కు వెళ్తున్నారా? అయితే సమస్య ఇదే!
లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శార్దూల్ ఠాకూర్ SRH టాప్ ఆర్డర్‌ను కూల్చగా.. ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ (36), పాట్ కమ్మిన్స్ (18)ల సహకారంతో SRH 190 స్కోరు సాధించింది. అయితే LSG బ్యాటింగ్ దీన్ని సునాయాసంగా ఛేదించింది. నికోలస్ పూరన్ (70), మిచెల్ మార్ష్ (52) సెంచరీ భాగస్వామ్యంతో జట్టును విజయతీరానికి చేర్చారు. మిల్లర్, అబ్దుల్ సమద్ చివర్లో జట్టుకు విజయం అందించారు.
IPL 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ రెడ్డి ఈ సీజన్‌లో పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. అతని కోపం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. కొందరు నిరాశను అర్థం చేసుకుంటే.. మరికొందరు ఈ చర్యను విమర్శించారు. SRH తదుపరి మ్యాచ్‌లో ఈ ఓటమి నుంచి కోలుకోవాల్సి ఉంది.