RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
- By Praveen Aluthuru Published Date - 04:55 PM, Wed - 22 May 24
![RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/pn7n4m0o_shimron-hetmyer-sanju-samson-bcci-ipl_625x300_16_April_23_11zon.jpg)
RCB vs RR Qualifier 2: ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓ మోస్తారు ఆరంభం లభించింది. ఓపెనర్లు డుప్లెసిస్ , కోహ్లీ తొలి వికెట్ కు 37 పరుగులు జోడించారు. కోహ్లీ 33 రన్స్ చేయగా…తర్వాత గ్రీన్ , రజత్ పటిదార్ ధాటిగా ఆడారు. అయితే రాజస్థాన్ స్పిన్నర్ల ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. వేగంగా పరుగులు చేసే క్రమంలో గ్రీన్ 27 , పటిదార్ 34 పరుగులకు వెనుదిరిగారు. భారీ అంచనాలు పెట్టుకున్న మాక్స్ వెల్ డకౌటవగా…దినేశ్ కార్తీక్ కూడా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. ఫలితంగా ఒత్తిడి పెరిగిన బెంగళూరు వరుస వికెట్లు చేజార్చుకుంది. అయితే లామ్రోర్ చివర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 , అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు జైశ్వాల్ , టామ్ తొలి వికెట్ కు 5.3 ఓవర్లలో 46 పరుగులు జోడించారు. టామ్ ఔటైనా జైశ్వాల్ దూకుడుగా ఆడాడు. 20 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే జైశ్వాల్ , సంజూ శాంసన్ వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ధృవ్ జురెల్ నాలుగో వికెట్ గా వెనుదిరిగేటప్పటికీ విజయం కోసం రాజస్థాన్ 7 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో రియాన్ పరాగ్ , హెట్ మెయిర్ మెరుపులు మెరిపించారు. దూకుడుగా ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. చివర్లో రియాన్ పరాగ్ ను సిరాజ్ ఔట్ చేసినా అప్పటికే బంతికో పరుగు చేయాల్సి ఉండడంతో విజయం కోసం రాజస్థాన్ పెద్దగా శ్రమించలేదు. ఈ విజయంతో టోర్నీలో ఆశలు నిలుపుకున్న రాజస్థాన్ రెండో క్వాలిఫయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. మరోవైపు సెకండాఫ్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి ప్లే ఆఫ్ కు చేరిన ఆర్సీబీ ఎలిమినేషన్ మ్యాచ్ లో ఓడిపోవడం ఆ జట్టు ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది.
Also Read: AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/hardik-pandya-223500926-16x9_0.jpg)
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.