Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్.. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్!
రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో ఒక పకటన విడుదల చేసింది. అందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2026కు ముందు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటారని తెలిపారు.
- By Gopichand Published Date - 02:53 PM, Sat - 30 August 25

Rahul Dravid: భారత మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇకపై రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో కొనసాగడం లేదు. ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో వెల్లడించింది. ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు ఆటగాడిగా 46 మ్యాచ్‌లు ఆడారు. గత సంవత్సరం భారత జట్టు ప్రధాన కోచ్‌గా తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రాహుల్ ద్రావిడ్ స్వచ్ఛంద నిర్ణయం
నివేదికల ప్రకారం.. రాహుల్ ద్రావిడ్ స్వయంగా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గత సీజన్‌లోనే ఆయన జట్టులో చేరినప్పటికీ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.
Also Read: CM Revanth Reddy : గోపీనాథ్ క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్ రెడ్డి
రాజస్థాన్ రాయల్స్ ప్రకటన
రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో ఒక పకటన విడుదల చేసింది. అందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2026కు ముందు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటారని తెలిపారు. “రాహుల్ చాలా కాలంగా రాయల్స్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. అతని నాయకత్వం చాలా మంది ఆటగాళ్లను ప్రోత్సహించింది. జట్టులో బలమైన విలువలను పెంపొందించింది. ఫ్రాంచైజీపై చెరగని ముద్ర వేసింది” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Your presence in Pink inspired both the young and the seasoned. 💗
Forever a Royal. Forever grateful. 🤝 pic.twitter.com/XT4kUkcqMa
— Rajasthan Royals (@rajasthanroyals) August 30, 2025
ద్రావిడ్‌కు ఫ్రాంచైజీలో మరింత పెద్ద పాత్రను ప్రతిపాదించినప్పటికీ ఆయన దానిని అంగీకరించలేదని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఫ్రాంచైజీకి ఆయన చేసిన విశేష కృషికి గాను రాజస్థాన్ రాయల్స్, ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ద్రావిడ్‌కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
గత సీజన్‌లో పేలవమైన ప్రదర్శన
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లోనే జట్టు తన కెప్టెన్‌ను మార్చింది. చాలా మ్యాచ్‌లలో సంజు శాంసన్‌కు బదులుగా రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సీజన్‌లోనే ద్రావిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి.