HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gopinath Is A Classy Mass Leader Cm Revanth Reddy

CM Revanth Reddy : గోపీనాథ్ క్లాస్‌గా కనిపించే మాస్ లీడర్ : సీఎం రేవంత్‌ రెడ్డి

సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మా పార్టీలు వేరు అయినా, గోపీనాథ్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది. చూడటానికి క్లాస్ లీడర్ లా కనిపించేవారు కానీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం మాస్ నేతగా నిలబెట్టింది అని పేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 30-08-2025 - 2:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gopinath is a classy mass leader: CM Revanth Reddy
Gopinath is a classy mass leader: CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో శుక్రవారం రోజు దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన గోపీనాథ్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గోపీనాథ్‌తో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మా పార్టీలు వేరు అయినా, గోపీనాథ్ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది. చూడటానికి క్లాస్ లీడర్ లా కనిపించేవారు కానీ, వాస్తవానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం మాస్ నేతగా నిలబెట్టింది అని పేర్కొన్నారు.

Read Also: Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

మూడు టర్ములు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్‌కు ఉన్న ప్రజాధారణ, ఆయన నిబద్ధతను సీఎం గుర్తు చేశారు. “ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నారు. మాగంటి గోపీనాథ్‌ రాజకీయ జీవనాన్ని వివరించిన సీఎం, ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక చైతన్యంతో కూడిన నాయకుడిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన గోపీనాథ్, ఎన్టీఆర్‌తో సన్నిహితంగా పని చేశారని తెలిపారు. 1985 నుంచి 1992 మధ్య కాలంలో తెలుగు యువత అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్‌గా, జిల్లా వినియోగదారుల ఫోరంలో సభ్యునిగా పలు బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. గోపీనాథ్ సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా రేవంత్ వివరించారు. ఆయన నిర్మించిన ‘పాతబస్తీ’, ‘రవన్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘నా స్టైలే వేరు’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినవని అన్నారు. రాజకీయాలు, సినిమా, సామాజిక సేవ అన్ని రంగాల్లో ఆయన తనదైన సత్తా చాటారని గుర్తు చేశారు.

ఇక శాసనమండలిలో కూడా మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించి ప్రత్యేక సంతాప తీర్మానం ఆమోదమైంది. మంత్రి శ్రీధర్ బాబు సభలో మాట్లాడుతూ..మాగంటి గోపీనాథ్ ఒక సత్పురుషుడు, ప్రజల కోసం జీవితాంతం పని చేసిన నాయకుడు అని కొనియాడారు. అలాగే, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతిపట్ల కూడా సంతాప తీర్మానం ఆమోదించి నివాళులు అర్పించారు. వీటితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా, ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకుడిగా మాగంటి గోపీనాథ్ స్మృతిలో నిలిచిపోయారు. ఆయన జీవితం, సేవలు, సమర్పణ రాజకీయాల్లో ఆశయం కోసం నిరంతరం పనిచేసే నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

Read Also: Kuppam : కుప్పం ప్రజల కల నెరవేర్చిన కృష్ణా జలాలు.. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLA
  • gaddam prasad kumar
  • jubilee hills
  • Magam Rangareddy
  • Maganti Gopinath
  • revanth reddy
  • sridhar babu
  • tdp
  • Telangana Assembly
  • telangana politics

Related News

Pawan is a person who thinks about two or three generations: Nagababu

నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ బాధ్యతలను నాగబాబు కు అప్పగించింది. సాధారణంగా ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Lokesh Tdp Office

    మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • 3 Years of Yuva Galam Padayatra Nara Lokesh

    నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఘనంగా సంబరాలు

Latest News

  • ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్

  • భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

  • పవిత్రస్థలం..అపవిత్రం చేసారు కదరా ! మీ ఫోటో షూట్ తగిలేయ్య !!

  • టొయోటా కారుకు షాకింగ్ సేఫ్టీ రేటింగ్‌.. భ‌ద్ర‌త అంతంత మాత్ర‌మే!

  • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd