Punjab Kings: పంజాబ్‌కు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం!
నేడు పంజాబ్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్‌కు భారీ షాక్ తగిలింది. జట్టులోని వేగవంతమైన బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
- By Gopichand Published Date - 03:00 PM, Tue - 15 April 25

Punjab Kings: నేడు పంజాబ్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్‌కు (Punjab Kings) భారీ షాక్ తగిలింది. జట్టులోని వేగవంతమైన బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ముల్లన్‌పూర్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. “లాకీ ఫెర్గూసన్ కొంతకాలం పాటు ఆడలేడు. టోర్నమెంట్ ముగిసే వరకు అతన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం. అతనికి తీవ్రమైన గాయం అయినట్లు నేను భావిస్తున్నాను” అని చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆరో ఓవర్‌లో రెండో బంతి వేస్తుండగా ఫెర్గూసన్‌కు ఎడమ కాలు తుంటి కింది భాగంలో గాయమైంది. ఫిజియో వచ్చి సలహా ఇచ్చిన తర్వాత అతను ఓవర్ మధ్యలోనే మైదానం వీడాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఆ మ్యాచ్‌ను హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
Also Read: Covid Born Baby Health: మీ పిల్లలు లాక్‌డౌన్‌లో జన్మించారా? అయితే ఈ వార్త మీ కోసమే!
ఐపీఎల్ 2025లో లాకీ ఫెర్గూసన్
పంజాబ్ కింగ్స్ ఫెర్గూసన్‌ను వేలంలో 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతను ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్. గుజరాత్ టైటాన్స్ తరఫున 157.3 కి.మీ/గంట వేగంతో బంతి వేశాడు. కొన్ని రోజుల క్రితం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఫెర్గూసన్ జట్టుకు కీలక బౌలర్ అని, అతను ఎల్లప్పుడూ 140 కి.మీ/గంట వేగంతో బంతులు వేస్తాడని చెప్పాడు.
ఐపీఎల్ 2025లో అతను 4 మ్యాచ్‌లు ఆడి, 68 బంతులు వేశాడు. 9.18 ఎకానమీతో 104 పరుగులు ఇచ్చాడు. అతని ఖాతాలో 5 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్ మొత్తంగా చూస్తే 2017 నుంచి ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లలో 51 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ స్పెల్ 28 పరుగులకు 4 వికెట్లు.
ఈ రోజు పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా
ఈ రోజు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్.. ముల్లన్‌పూర్ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 5 మ్యాచ్‌లలో 2 ఓడి, ఆరో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్‌లలో 3 గెలిచి, 3 ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.