HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Social Media Influencer Nancy Murdered

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

  • Author : Vamsi Chowdary Korata Date : 05-03-2026 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian-Origin YouTuber Nancy Grewal
Indian-Origin YouTuber Nancy Grewal

Nancy Grewal  కెనడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ (45) హత్యకు గురయ్యారు. అంటారియోలోని విండ్సర్-ఎసెక్స్ ప్రాంతం పరిధిలో ఉన్న లాసెల్ టౌన్‌లోని ఆమె నివాసంలోనే ఈ ఘోరం జరిగింది. మార్చి 3న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో నాన్సీ గ్రెవాల్‌పై కత్తితో దాడి జరిగింది. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆమె తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు.
Nancy Grewal, Punjabi-origin YouTuber in Canada

Nancy Grewal, Punjabi-origin YouTuber in Canada

‘ఖల్సా బాక్స్’ కథనం ప్రకారం.. నాన్సీ గ్రెవాల్ పంజాబీ ప్రవాస సమాజంలో మంచి గుర్తింపు ఉన్న యూట్యూబర్. పంజాబ్ సమస్యలు, భారత రాజకీయాలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌తో పాటు ఖలిస్థానీ ఉగ్రవాద భావజాలాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించేవారు. గురుద్వారాలను వేర్పాటువాద ప్రచారం కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టేవారు. సమస్యలుంటే భారత్‌లోనే పరిష్కరించుకోవాలని, విదేశాల నుంచి విద్వేషం రెచ్చగొట్టవద్దని ఆమె హితవు పలికేవారు.

ఈ ఘటనపై లాసెల్ పోలీసులు స్పందిస్తూ.. దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి దీనిని ఒక ‘ఐసోలేటెడ్’ (వ్యక్తిగత లేదా అరుదైన) ఘటనగానే పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. నాన్సీ గ్రెవాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. నాన్సీ హత్యతో కెనడాలోని స్థానిక పంజాబీ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • canada
  • Extremism
  • Gurpatwant Singh Pannun
  • india
  • Khalistan
  • Lasalle
  • Nancy Grewal
  • Ontario
  • punjab
  • Sikhs for Justice
  • Social Media Influencer

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd