Champions Trophy: టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లకుంటే పీసీబీకి లాభమా..?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) ఆతిథ్యం పాకిస్థాన్ చేతిలో ఉంది. అయితే ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
- Author : Gopichand
Date : 24-07-2024 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
Champions Trophy: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy) ఆతిథ్యం పాకిస్థాన్ చేతిలో ఉంది. అయితే ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ వైపు నుంచి స్పష్టమైన తిరస్కరణ ఉంది. భారత జట్టు అక్కడికి వచ్చేలా పాక్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు శ్రీలంకలో ఐసీసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ సెక్రటరీ జై షా, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పుడు చాలా పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భారత జట్టు మ్యాచ్‌లు పాకిస్తాన్ వెలుపల నిర్వహిస్తే.. దాని కోసం పిసిబికి ఎక్కువ డబ్బు వస్తుందని వాటి సారాంశం.
PCB ప్రయోజనం పొందుతుంది
ఇటీవల శ్రీలంకలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ సమావేశం తరువాత కూడా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌కు వెళ్తుందో లేదో తెలియదు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత జట్టు మ్యాచ్‌లు పాకిస్తాన్ వెలుపల నిర్వహిస్తే దాని కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదనపు డబ్బును పొందుతుందని పేర్కొంటున్న అనేక పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Paris Olympics: పారిస్ ఒలింపిక్స్.. ఆటగాళ్లకు పెట్టే ఫుడ్ మెనూ ఇదే..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పిసిబి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లో ఆడాలి. కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ మారవచ్చు. ఎందుకంటే ఐసిసి కూడా భారత్‌ను పాకిస్తాన్‌కు వచ్చేలా ఒప్పించడంలో విఫలమైతే టీమిండియా మ్యాచ్‌ల వేదిక మరోసారి మారవచ్చు. అయితే టీమిండియా.. పాక్ వెళ్లటానికి సముఖంగా లేదు. ఒకవేళ టీమిండియా పాక్ రాకుంటే ఐసీసీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.