మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
- Author : Gopichand
Date : 16-12-2025 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
- ఐపీఎల్ వేలంలో జోరు చూపిస్తున్న కేకేఆర్
- మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న నైట్ రైడర్స్
- ఇప్పటికే గ్రీన్‌ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
Matheesha Pathirana: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్‌ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు. పతిరానా తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌ను 2022లో ఆడాడు. గతంలో అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో పతిరానా బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ తరచుగా ‘వైడ్’ బంతులు వేయడం అతనికి ప్రధాన సమస్యగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం అబుదాబిలో జరిగిన వేలంలో 369 మంది ఆటగాళ్లపై ఫ్రాంచైజీ జట్లు బిడ్లు వేశాయి. ఈ ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట ఆస్ట్రేలియా ఆటగాడు కామరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసి, అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిపింది.
ఇప్పుడు KKR ఫ్రాంచైజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన వేలం పోటీలో కోల్‌కతా విజయం సాధించి మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బిడ్‌తో మతీషా పతిరానా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ధరకు అమ్ముడైన శ్రీలంక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
పతిరానా ఐపీఎల్ కెరీర్
పతిరానా ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్లో అతను 12 మ్యాచ్‌లు ఆడి, 32.61 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. అయితే అతని ఎకానమీ రేట్ 10.13గా ఉంది. ఇప్పటివరకు 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 21.61 సగటుతో 47 వికెట్లు తీశాడు. ఒకసారి 4 వికెట్ల హాల్ సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/28.
Also Read: గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!
25.20 Crore for Cameron Green.
18 Crore for Matheesha Pathirana.
TWO BIG BUY FOR KOLKATA KNIGHT RIDERS…!!!! pic.twitter.com/SDJfoCZkwB
— Johns. (@CricCrazyJohns) December 16, 2025
మొత్తం టీ20 కెరీర్ గణాంకాలు
పతిరానా తన ఓవరాల్ టీ20 కెరీర్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.
మొత్తం టీ20 మ్యాచ్‌లు: 99
వికెట్లు: 132 (సగటు: 21.46)
4 వికెట్ల హాల్స్: 5 సార్లు సాధించాడు.
అత్యుత్తమ ప్రదర్శన: 4/20.
అంతర్జాతీయ టీ20లు (T20I)
మ్యాచ్‌లు: 21
వికెట్లు: 31 (సగటు: 18.25)
అత్యుత్తమ ప్రదర్శన: 4/24.