గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!
కేకేఆర్ జట్టు ఖాతా నుండి మాత్రం పూర్తి మొత్తం అంటే రూ. 25.20 కోట్లు కట్ అవుతాయి. కానీ ఆటగాడికి రూ. 18 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 7.20 కోట్లు బీసీసీఐ వద్దకు చేరుతాయి. ఈ మొత్తాన్ని బోర్డు ఆటగాళ్ల సంక్షేమ నిధి కోసం ఉపయోగిస్తుంది.
- Author : Gopichand
Date : 16-12-2025 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
Cameron Green: ఐపీఎల్ 2026 మినీ వేలం హోరాహోరీగా సాగుతోంది. అంచనాలకు తగ్గట్టే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 25.20 కోట్ల భారీ ధరకు అతడిని దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అయితే వేలంలో రూ. 25.20 కోట్లు పలికినప్పటికీ గ్రీన్ చేతికి మాత్రం కేవలం రూ. 18 కోట్లు మాత్రమే అందుతాయి. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన ఐపీఎల్ నిబంధన ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్‌కు రూ. 18 కోట్లు మాత్రమే ఎందుకు లభిస్తాయి?
విదేశీ ఆటగాళ్ల వేతనం విషయంలో బీసీసీఐ గరిష్ట రుసుము నిబంధన అనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నియమం ప్రకారం.. వేలంలో విదేశీ ఆటగాడు ఎంత భారీ ధరకు అమ్ముడైనప్పటికీ, అతనికి ఇచ్చే గరిష్ట వేతనం రూ. 18 కోట్లు మాత్రమే. వేలంలో గరిష్ట రిటెన్షన్ ధర (ఇది ప్రస్తుతం రూ. 18 కోట్లు) లేదా గత మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడి ధర (రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు) వీటిలో ఏది తక్కువైతే అంత మొత్తమే విదేశీ ఆటగాడికి గరిష్టంగా లభిస్తుంది. ఈ లెక్కన ప్రస్తుత వేలంలో ఏ విదేశీ ఆటగాడికైనా రూ. 18 కోట్ల కంటే ఎక్కువ మొత్తం వేతనంగా లభించదు.
Also Read: రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
మిగిలిన రూ. 7.20 కోట్లు ఏమవుతాయి?
కేకేఆర్ జట్టు ఖాతా నుండి మాత్రం పూర్తి మొత్తం అంటే రూ. 25.20 కోట్లు కట్ అవుతాయి. కానీ ఆటగాడికి రూ. 18 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 7.20 కోట్లు బీసీసీఐ వద్దకు చేరుతాయి. ఈ మొత్తాన్ని బోర్డు ఆటగాళ్ల సంక్షేమ నిధి కోసం ఉపయోగిస్తుంది.
కామరూన్ గ్రీన్ ఐపీఎల్ కెరీర్
గ్రీన్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రెండు సీజన్లు ఆడాడు. 2023లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన అతను, 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.
- మ్యాచ్‌లు: 29 (28 ఇన్నింగ్స్‌లు)
- పరుగులు: 707
- సగటు: 46.6 | స్ట్రైక్ రేట్: 153.7
- విశేషాలు: 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు.