HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2026 Suresh Raina Re Entry In Csk

Suresh Raina: చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులోకి సురేష్ రైనా?!

వేదిక ప్ర‌కారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా జ‌ట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.

  • Author : Gopi Date : 14-07-2025 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Retirement
Retirement

Suresh Raina: ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కి అనుకున్న స్థాయిలో రాణించ‌లేదు. అంతేకాకుండా పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. అప్పటి నుండి సీఎస్‌కే తదుపరి సీజన్ కోసం కొన్ని ప్రత్యేక సన్నాహాలు చేయవచ్చని, జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి. జట్టు న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్రను విడుదల చేయవచ్చని, అతనిపై ఢిల్లీ క్యాపిటల్స్ దృష్టి సారించిందని చర్చలు జరుగుతున్నాయి.

అదే విధంగా సీఎస్‌కే గోల్డెన్ పిరీయ‌డ్‌లో ముఖ్య స్తంభంగా ఉన్న సురేష్ రైనా (Suresh Raina) మరోసారి బ్యాటింగ్ కోచ్‌గా జట్టుతో చేరవచ్చని చర్చలు జరుగుతున్నాయి. ఓ జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్‌ను జట్టులో చేర్చుకోవడాన్ని పరిశీలిస్తోంది. శాంసన్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా క‌నిపించాడు. అయితే ఐపీఎల్ 2026లో అత‌ను చెన్నై లేదా కోల్‌క‌తా జ‌ట్టులో చేర‌వ‌చ్చ‌నే క‌థ‌నాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. నివేదిక ప్ర‌కారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా జ‌ట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.

Also Read: Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..

రచిన్ రవీంద్ర విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అతనిపై దృష్టి సారించింది. అతను ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. సీఎస్‌కే రచిన్ రవీంద్రను విడుదల చేసి డోనోవన్ ఫెరీరాను జట్టులో చేర్చుకోవాలని భావిస్తోందని స‌మాచారం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త ఓపెనర్ అవసరం ఉంది. వారు ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ‌ సీఎస్‌కే రచిన్ రవీంద్రను విడుదల చేస్తే.. అతన్ని జట్టులో చేర్చుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రచిన్ 8 మ్యాచ్‌లలో 27.29 సగటుతో 191 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను కేవలం ఒక మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించాడు. అందులో అతను 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK
  • IPL 2025
  • IPL 2026
  • Rachin Ravindra
  • Sanju Samson
  • sports news
  • Suresh Raina

Related News

Vaibhav

Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 96 పరుగులతో చెలరేగిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం పలు ఐపీఎల్ రికార్డులను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సా

  • IPL 2026

    IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Ipl 2026

    IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • League Stage Concludes: Who Will Face Whom, and When?

    IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవ‌రితో ఎవ‌రు ఎప్పుడు త‌ల‌ప‌డ‌నున్నారంటే?

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd