HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Proposes Nift At Amaravati To Union Textiles Minister

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Author : Prasad Date : 29-05-2026 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP
AP

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు, పోక చెక్క వంటి ఉద్యాన పంటల ద్వారా లభించే పీచు, నార, ఫైబర్‌కు విలువ జోడించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. అరటి కాండం నుంచి పీచు వెలికితీసే కేంద్రాలను కడప, అనంతపురం, నంద్యాల, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.

కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలను బలోపేతం చేయడానికి మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయిర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తీరప్రాంతాల్లో నేల కోత నివారణ, గట్ల బలోపేతానికి కాయిర్ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా కుప్పంలో PM MITRA పార్క్ ఏర్పాటు చేయాలని, అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) స్థాపనకు రూ.280 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. నిఫ్ట్ కోసం ఇప్పటికే అమరావతిలో 10 ఎకరాల భూమిని కేటాయించినట్లు వివరించారు. మంగళగిరిలో రూ.22.36 కోట్లతో చేనేత పార్కు, అమరావతిలో చేనేత-హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా సీఎం ప్రతిపాదించారు. అలాగే ఏపీని నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్ కింద ప్రాధాన్య రాష్ట్రంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, జౌళి రంగ అభివృద్ధికి కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Chandrababu
  • bjp
  • kuppam
  • NIFT
  • tdp

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • AP government takes another key decision

    CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd