HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Vaibhav Suryavamshi Ipl Records

Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • Author : Prasad Date : 30-05-2026 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vaibhav
Vaibhav

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 96 పరుగులతో చెలరేగిన ఈ 15 ఏళ్ల యువ సంచలనం పలు ఐపీఎల్ రికార్డులను బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు బాదిన అతడు 204.26 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే 18వ ఓవర్‌లో ర‌బ‌డా బౌలింగ్‌లో అవుటై కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే శతకం మిస్సైనా రికార్డుల విషయంలో మాత్రం సూర్యవంశీ కొత్త చరిత్ర రాశాడు. సాయి సుద‌ర్శ‌న్ పేరిట ఉన్న అత్యంత వేగంగా 1000 ఐపీఎల్ పరుగులు చేసిన భారత బ్యాటర్ రికార్డును అధిగమించాడు. సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సూర్యవంశీ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

అలాగే వెస్టిండీస్ మాజీ బ్యాటర్ సైమ‌న్స్‌ రికార్డును సమం చేస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మార్ష్‌ 21 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు ఒకే ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో 500కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అతని ఖాతాలో పవర్‌ప్లేలో 502 పరుగులు ఉన్నాయి. గతంలో ఈ రికార్డు డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్నర్ 2016 సీజన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 776 పరుగులు సాధించాడు. 237.30 స్ట్రైక్‌రేట్, 48.50 సగటుతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అతడు 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అయాతే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ గుజ‌రాత్ ఓట‌మి చెందిన ఇంటిబాట ప‌ట్టింది. గుజ‌రాత్ టైటాన్స్ రేపు బెంగుళూర్‌పై ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gujarat titans vs Rajasthan Royals
  • IPL 2026
  • Vaibhav Suryavanshi
  • Vaibhav Suryavanshi Century

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd