Orange- Purple Cap: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ.. బౌలింగ్‌లో చాహల్, ఈ ఇద్దరే టాప్..!
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పర్ఫుల్, ఆరెంజ్ క్యాప్ లు ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- Author : Gopichand
Date : 23-04-2024 - 2:33 IST
Published By : Hashtagu Telugu Desk
Orange- Purple Cap: ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లు దాదాపు పూర్తయ్యాయి. అయితే ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ దాదాపు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆదివారం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన పోరులో చివరి బాల్ వరకు టెన్షన్ టెన్షన్‌గా కొనసాగింది. చివరకు కేకేఆర్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇలాంటి మ్యాచ్‌లు ఒకవైపు జరుగుతుండగా.. ఏకపక్షంగా కొనసాగే మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. అయితే సోమవారం ముంబై వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పర్ఫుల్, ఆరెంజ్ క్యాప్ (Orange- Purple Cap)లు ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముంబై ఇండియన్స్ (MI)- రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 200 వికెట్లు పూర్తి చేయడం ద్వారా పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. IPL 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్ ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లతో పాటు నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ముగ్గురు భారత బౌలర్లు ఎనిమిది మ్యాచ్‌లలో వారి పేర్లలో 13 వికెట్లు కలిగి ఉన్నారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన ముంబై ఇండియన్స్‌కు చెందిన గెరాల్డ్ కోయెట్జీ పర్పుల్ క్యాప్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ శామ్ కర్రాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను ఎనిమిది మ్యాచ్‌లలో 11 వికెట్లతో ఉన్నాడు.
Also Read: Pink Moon 2024 : పింక్ మూన్‌కు వేళైంది.. ఇదేమిటి ? ఏ టైంలో కనిపిస్తుంది ?
ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆరు మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ ట్రావిస్ ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రియాన్ పరాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎనిమిది మ్యాచ్‌ల్లో 303 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
We’re now on WhatsApp : Click to Join