India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఆధిపత్యం ఎవరిది?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్.. భారతదేశంపై ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు తలపడగా, పాకిస్తాన్ 3 సార్లు, భారతదేశం రెండుసార్లు గెలిచింది.
- By Gopichand Published Date - 07:45 AM, Sun - 23 February 25

India vs Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో క్రికెట్ అభిమానులు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య అద్భుతమైన మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 23న రెండు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తమ ప్రతిష్ట, గర్వం కోసం తలపడనున్నాయి. ఇది గ్రూప్ దశ మ్యాచ్ మాత్రమే కాదు.. రెండు జట్లకు కీలక మ్యాచ్ కూడా. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉంటోంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చాలాసార్లు తలపడ్డాయి. కానీ ఎవరిది పైచేయి? అనేది ఇప్పుడు చూద్దాం.
హెడ్ టు హెడ్ రికార్డు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్.. భారతదేశంపై ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు తలపడగా, పాకిస్తాన్ 3 సార్లు, భారతదేశం రెండుసార్లు గెలిచింది. 2004, 2009, 2013 సంవత్సరాల్లో రెండు జట్లు ఒక్కొక్కసారి తలపడ్డాయి. 2017లో రెండుసార్లు తలపడ్డారు.
Also Read: Mrunal Thakur: పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. అసలు విషయం తెలియడంతో?
జాబితా
- 2004 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ – పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది.
- 2009 – సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ – పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో గెలిచింది.
- 2013 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ – భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
- 2017 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ – టీమిండియా 124 పరుగుల తేడాతో గెలిచింది
- 2017 (ఫైనల్) – ది ఓవల్, లండన్ – పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో గెలిచింది.
2017 ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోగలదా?
చివరిసారిగా భారత్, పాకిస్తాన్‌లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడినది 2017 ఫైనల్లో అక్కడ పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. ఈ ఓటమితో వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను గెలుచుకోవాలనే భారత జట్టు కల చెదిరిపోయింది. ఇప్పుడు 2025లో జరిగే ఈ గొప్ప మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక సువర్ణావకాశం లభించనుంది. మరీ ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోగలదా అనేది చూడాలి.