న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!
భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే రెండో టీ20 మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేజ్ చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
- Author : Gopichand
Date : 23-01-2026 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
India vs New Zealand: రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 15.2 ఓవర్లలోనే ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
24 ఇన్నింగ్స్‌ల తర్వాత కెప్టెన్ సూర్య హాఫ్ సెంచరీ
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా నిలిచింది. దాదాపు 24 ఇన్నింగ్స్‌ల తర్వాత ఆయన బ్యాట్ నుండి అర్ధ సెంచరీ నమోదైంది. సూర్య 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీనికి ముందు సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్‌పై 75 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించారు.
Also Read: ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?
టీమిండియా వరల్డ్ రికార్డ్
భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే రెండో టీ20 మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేజ్ చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. పాకిస్థాన్ 24 బంతులు మిగిలి ఉండగానే కివీస్ జట్టుపై 200+ పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించింది.