India vs New Zealand: బెంగళూరులో భారీ వర్షం.. తొలి రోజు మ్యాచ్ కష్టమేనా..?
ఉదయం 10.30 గంటలకు 43 శాతం, 11.30 గంటలకు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరమంతా జలమయమైంది.
- By Gopichand Published Date - 10:39 AM, Wed - 16 October 24

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. బెంగళూరులో ఉదయం 9 గంటలకు 24 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ ప్రారంభ సమయం 9.30 అయినప్పటికీ వర్షం కారణంగా అనుకున్న సమయానికి ప్రారంభంకాలేదు.
ఉదయం 10.30 గంటలకు 43 శాతం, 11.30 గంటలకు 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరమంతా జలమయమైంది. దీంతో రోజువారీ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ సెషన్లు కూడా రద్దయ్యాయి.
Also Read: Akhanda -2 : అఖండ సీక్వెల్‌గా ‘అఖండ 2-తాండవం’.. ఈ రోజు హైదరాబాద్‌లో మూవీ ప్రారంభోత్సవం
వాతావరణం గురించి టామ్ లాథమ్ ఏం చెప్పారు?
న్యూజిలాండ్ జట్టు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు భారతదేశాన్ని తరచుగా ఇబ్బంది పెట్టింది. టీమిండియాపై మరోసారి అదే పని చేయాలని జట్టు భావిస్తోంది. ఫాస్ట్ బౌలర్లు ఆడేందుకు వాతావరణం ఎంతగానో సహకరిస్తుందని కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ అభిప్రాయపడ్డాడు. మంగళవారం మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో లాథమ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి వాతావరణాన్ని మేము ఊహించలేదు. ఇది మేము ఊహించినంత వేడిగా లేదు. మేము ఇక్కడ ఆడిన చివరి మ్యాచ్‌ని సమీక్షిస్తాం. అయితే ఈ సమయంలో ఏదైనా ఖచ్చితంగా చెప్పడం కష్టం. బెంగళూరులోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే భారత జట్టు బౌలింగ్ కలయికను కూడా పరిగణించవచ్చని ఆయన తెలిపారు.
బెంగళూరులో గంటల వారీ వాతావరణ అప్డేట్ (అక్టోబర్ 16)
- ఉదయం 10 గంటలకు వర్షం పడే అవకాశం 5%.
- ఉదయం 11 గంటలకు వర్షం పడే అవకాశం 5%.
- మధ్యాహ్నం 12 గంటలకు వర్షం పడే అవకాశం 8%
- మధ్యాహ్నం 1 గంటకు వర్షం పడే అవకాశం 51%.
- మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పడే అవకాశం 51%
- మధ్యాహ్నం 3 గంటలకు, వర్షం పడే అవకాశం 47%
- సాయంత్రం 4 గంటలకు, వర్షం పడే అవకాశం 14%.
- సాయంత్రం 5 గంటలకు, వర్షం పడే అవకాశం 14%.