India vs Australia: భారత్ గెలవాలంటే 7 వికెట్లు.. ఆసీస్ గెలవాలంటే 91 పరుగులు, లంచ్ సమయానికి ఆసీస్‌దే పైచేయి!
భారత్ గెలవాలంటే 7 వికెట్లు, ఆస్ట్రేలియా విజయానికి 91 పరుగులు చేయాలి. అయితే బౌలింగ్‌కు టీమిండియా కెప్టెన్ బుమ్రా అందుబాటులో లేడు.
- By Gopichand Published Date - 07:21 AM, Sun - 5 January 25

India vs Australia: భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఐదో, చివరి టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు గెలుపు ఓటములతో రెండు ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ కేవలం 157 పరుగులకే కుప్పకూలడంతో కంగారూ జట్టు 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. కంగారూ జట్టును ఇన్ని పరుగులు చేయకుండా టీమ్ ఇండియా ఎలాగైనా ఆపగలిగితే ఆ జట్టు డిఫెండింగ్‌లో విజయం సాధించిన సిడ్నీ మైదానంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్‌లలో ఒకటిగా నిలిచే అవకాశముంది.
భారత్-ఆస్ట్రేలియాల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 3 నుండి సిడ్నీలో జరుగుతుంది. ఇందులో మూడవ రోజు ఈ రోజు అంటే జనవరి 5న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 162 పరుగుల లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉండగా.. ఆ జట్టు 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. భారత్ గెలవాలంటే 7 వికెట్లు, ఆస్ట్రేలియా విజయానికి 91 పరుగులు చేయాలి. అయితే బౌలింగ్‌కు టీమిండియా కెప్టెన్ బుమ్రా అందుబాటులో లేడు.
Also Read: HMPV Virus China: చైనాలో ప్రాణాంతక వైరస్.. భారతదేశంపై ప్రభావం ఎంత?
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోని ఐదో, చివరి టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ -ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో మూడో రోజు. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 185 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కంగారూ జట్టు రెండవ రోజు 181 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా భారత జట్టు 4 పరుగుల ముఖ్యమైన ఆధిక్యం సాధించింది. అరంగేట్ర ఆటగాడు వ్యూ వెబ్‌స్టర్ ఆస్ట్రేలియా తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతని మొదటి మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు 162 పరుగుల లక్ష్యాన్ని అందించిన భారత్ రెండో ఇన్నింగ్స్ 157 పరుగులకే పరిమితమైంది. ప్రస్తుతం కంగారూ జట్టు లక్ష్యాన్ని ఛేదించే దిశగా కనిపిస్తోంది. వార్త రాసే సమాయానికి ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (19), హెడ్ (5) పరుగులతో క్రీజులో నిలిచారు.