HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Pakistan Game Called Off Due To Rain Saved Teamindia

India-Pakistan: ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దు.. ఏ జట్టుకి ప్లస్ అయ్యింది..?

2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది.

  • Author : Gopichand Date : 03-09-2023 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India-Pakistan
Compressjpeg.online 1280x720 Image 11zon

India-Pakistan: 2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ తర్వాత వర్షం కారణంగా పాక్ జట్టు బ్యాటింగ్‌కు దిగలేకపోయింది. భారత్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా పతనమైంది. పల్లెకల్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించాలంటే 267 పరుగులు చేయాల్సి ఉంది. జట్టు గత ప్రదర్శనను పరిశీలిస్తే, ఈ లక్ష్యం వారికి పెద్దదేమి కాదు.

భారత్‌తో మ్యాచ్‌ పాకిస్థాన్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ వర్షం భారత ఆటగాళ్ల గౌరవాన్ని కాపాడింది. టోర్నీలో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. నేపాల్‌పై 342 పరుగులు చేసింది. ఈ సమయంలో బాబర్ అజామ్ 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇఫ్తికార్ అహ్మద్ 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌పై పాక్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేసేవారు. కానీ వర్షం మ్యాచ్‌ని పూర్తి చేసేందుకు అనుమతించలేదు.

Also Read: ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ జట్టు ఎంపిక.. బరిలోకి దిగే జట్టు ఇదేనా..?

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. జట్టు ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ చాలా సందర్భాలలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. మహ్మద్ రిజ్వాన్ కూడా ప్రమాదకరమైన బ్యాటింగ్ చేస్తాడు. ఈ ఆటగాళ్లు భారత్‌పై తమ సత్తా చూపేవారు.

పాక్ బౌలింగ్ ఎటాక్ టీమ్ ఇండియాను పూర్తిగా శాసించడం గమనార్హం. షాహీన్ అఫ్రిది 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను 2 మెయిడిన్ ఓవర్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను షాహీన్ తీశాడు. నసీమ్ షా 8.5 ఓవర్లలో 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హరీస్ రవూఫ్ 9 ఓవర్లలో 58 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆఘా సల్మాన్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. వికెట్లు పడకపోయినా.. సల్మాన్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2023
  • ind vs pak
  • india
  • India-Pakistan
  • pakistan
  • rohit sharma
  • virat kohli

Related News

Pakistan extends ban on Indian flights

భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • Pakistan

    పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • Adiala Jail

    పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

  • LPG Price

    LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

  • IND U19 vs PAK U19

    IND U19 vs PAK U19: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

Latest News

  • అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd