IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసినప్పటికీ మ్యాచ్ ఆట సాగనుంది.
- By Gopichand Published Date - 10:00 AM, Mon - 2 June 25

IPL Final: ఐపీఎల్ 2025 ఫైనల్ (IPL Final) మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసినప్పటికీ మ్యాచ్ ఆట సాగనుంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ 5 ఓవర్ల మ్యాచ్ కోసం కట్‌ఆఫ్ సమయాన్ని రాత్రి 11:56 గంటల వరకు నిర్ణయించింది. ఒకవేళ వర్షం కారణంగా అప్పటి వరకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటిస్తారు.
కానీ ఫైనల్ మ్యాచ్ విషయంలో అలా ఉండదు. ఫైనల్ మ్యాచ్ వర్షం తర్వాత కూడా పూర్తి మ్యాచ్ ఆడనున్నారు. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది. జూన్ 3న మ్యాచ్ పూర్తి కాకపోతే, జూన్ 4న మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఫైనల్ పోరుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఇకపోతే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈనెల 3న జరగనున్న విషయం మనకు తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచడటంతో క్రికెట్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Weather Updates : మరో మూడు రోజులు భారీ వర్ష సూచన.. ఎక్కడెక్కడంటే..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఇప్పటికే ఫైనల్‌లో స్థానం సంపాదించింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2లో స్థానం సంపాదించింది. ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ పంజాబ్‌కు పాయింట్ల టేబుల్‌లో టాప్-2లో ఉండటం వల్ల ప్రయోజనం లభించింది. ఫైనల్‌లో స్థానం సంపాదించడానికి పంజాబ్‌కు రెండో అవకాశం లభించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ ముంబైతో తలపడింది. ముంబై- పంజాబ్‌లలో గెలిచిన జట్టు జూన్ 3న ఫైనల్‌లో ఆర్‌సీబీతో తలపడుతుంది. ముంబై ఫైనల్‌కు చేరుకుంటే వారు తమ ఆరవ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటే.. ఆర్‌సీబీ- పంజాబ్‌లలో గెలిచిన జట్టు తమ తొలి ట్రోఫీని ముద్దాడనుంది.