HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Amir Lashes Out At Team India Again

టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mohammad Amir
Mohammad Amir
Mohammad Amir  టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్‌కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశాడు.

“హార్నా మనా హై” అనే టీవీ షోలో ఆమిర్ మాట్లాడుతూ.. “క్రికెట్ పరంగా విశ్లేషిస్తే, భారత్ మంచి క్రికెట్ ఆడటం లేదు. వాళ్ల ఫీల్డింగ్ చూడండి. కనీసం 3-4 క్యాచ్‌లు వదిలేశారు. బుమ్రా మినహా ప్రతీ బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. పెద్ద జట్లపై హార్దిక్ పాండ్యా ఎప్పుడూ రాణించడని నేను ముందే చెప్పాను. అతను 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. సెమీఫైనల్‌కు చేరిన జట్లు స్పిన్నర్లను బాగా ఆడతాయి” అని విమర్శించాడు.

అలాగే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోని ఒక వివాదాన్ని ఆమిర్ తెరపైకి తెచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో హెట్‌మైర్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంపై మాట్లాడుతూ.. “హెట్‌మైర్ ఔట్ వివాదాస్పదం అని నేను భావిస్తున్నాను. అతను ఔటయ్యాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి, స్కోరు 220-230కి చేరి ఉంటే, ఈరోజు భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించేది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket analysis
  • Hardik Pandya
  • ICC T20 World Cup 2026
  • india cricket
  • India vs England
  • Jasprit Bumrah
  • Mohammad Amir
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav (SKY)
  • T20 World Cup 2026
  • T20 World Cup 2026 Final
  • West Indies match

Related News

India vs. England first T20 series starts today.

IND Vs ENG: నేటి నుంచే భారత్‌-ఇంగ్లండ్‌ తొలి టీ20 సిరీస్‌

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించింది. మరోవైపు భారత్ సైతం ఈ మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. ఇక ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చెస్టర్ లీ స్ట్రీట్

    Latest News

    • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

    • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

    • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

    • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd