HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Alex Carey Keeps It Mindblowing

AUS vs ENG : అలెక్స్ క్యారీ మైండ్‌బ్లోయింగ్ కీపింగ్!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-12-2025 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Alex Carey
Alex Carey

యాషెస్ సిరీస్‌లో అలెక్స్ క్యారీ అద్భుత కీపింగ్‌తో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో అతని మెరుపు వేగం, చాకచక్యం ప్రశంసనీయం. స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు సమష్టి కృషితో గబ్బా టెస్టును కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2 – 0 ఆధిక్యంలో ఉంది. గబ్బా టెస్టులో అలెక్స్ క్యారీ కీపింగ్ ప్రదర్శన యాషెస్ సిరీస్ చరిత్రలో కొన్నాళ్ల పాటు నిలిచిపోవడం ఖాయం.

హీరో ఆఫ్ ది యాషెస్.. అలెక్స్ క్యారీ! వినడానికి కాస్తంత అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. గబ్బా టెస్టును మీరు చూసుంటే కచ్చితంగా ఇది నిజం అని ఒప్పుకుంటారు. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య జరిగిన యాషెస్ రెండో టెస్టులో అలెక్స్ క్యారీ అద్భుత కీపింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమిలో అలెక్స్ క్యారీ పాత్ర చాలా ముఖ్యమని చెప్పొచ్చు.

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి గబ్బా టెస్టులో విజయం సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసినా, ఆసీస్ బ్యాటర్లలో ఒక్కళ్లు కూడా సెంచరీ చేయకపోయినా జట్టు స్కోర్ 500 మార్క్ దాటింది. దీన్నే జట్టు సమష్టి కృషి అంటారు. ఓపెనర్ నుంచి లాస్ట్ వికెట్ వరకూ ప్రతి ఒక్కళ్లూ అద్భుతంగా ఆడారు. దాంతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కింది.

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఇంగ్లండ్ వికెట్లు పడినా కాస్తంత పుంజుకుని ఆడింది. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్.. షార్ట్ కీపింగ్‌తో అలెక్స్ క్యారీని వికెట్ల వెనుకే ఉంచి పేసర్లతో బంతులు విసిరించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కాళ్లకు కళ్లెం వేసేశారు. స్టోక్స్ ఫుట్ వర్క్‌తో స్కోర్ చేసే బ్యాటర్, అలాంటి బ్యాటర్‌ను కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కట్టుదిట్టం చేశారు. ఆ క్రెడిట్ అంతా అలెక్స్ క్యారీదే!

అలెక్స్ క్యారీ మెరుపు వేగంతో వచ్చే బంతుల్ని సైతం వికెట్లకు అడుగు దూరంలో నిల్చొని పట్టుకున్నాడు. బౌన్సీ బంతులను సైతం వికెట్ల వెనుకే ఉండి ఆపాడంటే అర్థం చేసుకోవచ్చు. గబ్బాలో పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఆసీస్ ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా అడుగుపెట్టింది. నేసర్, బోలాండ్ వంటి పేస్ బౌలర్లు వేసే బంతులను క్యారీ ఆపిన తీరుకు క్రికెట్ లోకం ఫిదా అయింది.

క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సైతం అలెక్స్ క్యారీ ఆటతీరుకు సలాం చేస్తున్నారు. యాషెస్ చరిత్రలో అలెక్స్ క్యారీ కీపింగ్ కొన్నేళ్ల వరకు గుర్తుండిపోవడం ఖాయమనే చెప్పొచ్చు. కేవలం కీపింగే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 500కు పైగా పరుగులు చేయడంలో హాఫ్ సెంచరీతో తనవంతు ప్రయత్నం కూడా చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 511 పరుగులు నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పోరాడినప్పటికీ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఆసీస్‌కు కేవలం 65 పరుగుల లక్ష్యమే అందడంతో.. నాలుగో రోజే మ్యాచ్‌ని ముగించారు. ఈ విజయంతో ఆసీస్ 2-0తో లీడింగ్‌లో ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో మూడో టెస్టు డిసెంబర్ 17న అడిలైడ్‌లో జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alex Carey
  • Ashes Series
  • AUS vs ENG
  • cricket news
  • Gabba Test
  • sports news

Related News

11 Runs In 1 Ball

ఫామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 ప‌రుగులు!

జకారీ ఫౌల్క్స్‌కు ఈ ఓవర్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మొదటి అఫీషియల్ బంతి పడేటప్పటికే అతను 11 పరుగులు ఇచ్చాడు.

  • India vs New Zealand

    న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!

  • RCB On Sale

    ఆర్‌సీబీ కొనుగోలుకు అదార్ పూనావాలా సిద్ధం.. రూ. 18,314 కోట్లకు డీల్ కుదిరే అవకాశం?

  • Shubman Gill Reappoint Rohit Sharma as ODI Captain Manoj Tiwary

    కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ అట్టర్ ప్లాప్.. మళ్ళీ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించండి .. బీసీసీఐకి మనోజ్ తివారీ సూచనలు

  • IPL Opening Ceremony

    బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌?

Latest News

  • సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!

  • ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?

  • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

  • స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!

  • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

Trending News

    • గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ

    • సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ

    • జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఖైదీలు

    • విమ‌ర్శ‌కుల‌కు పెద్దితో చెక్ పెట్ట‌నున్న ఏఆర్ రెహ‌మాన్‌?!

    • వాషింగ్ మెషీన్‌లో ఎన్ని బట్టలు వేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd