Speed News
-
Cloudburst: జమ్మూ కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 65 మంది మృతి, 200 మంది గల్లంతు?
ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా సందర్శించనున్నారు.
Published Date - 04:05 PM, Fri - 15 August 25 -
Ranga reddy : ఫామ్‌హౌస్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో 40 మంది నైజీరియన్లు
వీరిలో కొంతమంది విద్యార్థులుగా ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులకు ముందుగానే సమాచారం అందిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, శనివారం అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. పార్టీలో గంజాయి, ఎల్ఎస్డీ వంటి మాదక పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Published Date - 01:29 PM, Fri - 15 August 25 -
79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్‌కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
Published Date - 11:24 AM, Fri - 15 August 25 -
PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Fri - 15 August 25 -
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బటాలియన్‌ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Published Date - 10:09 AM, Fri - 15 August 25 -
Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి!
ఈ విషాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Published Date - 09:33 PM, Thu - 14 August 25 -
Supreme Court: బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలగించబడిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించగా, 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారని లేదా కనుగొనబడలేదని, 7 లక్షల మంది రెండు చోట్ల నమోదయ్యారని తెలిసింది.
Published Date - 07:21 PM, Thu - 14 August 25 -
YCP : హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
YCP : హైకోర్టు తీర్పు వైఎస్సార్సీపీకి నిరాశ కలిగించింది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలపై
Published Date - 05:54 PM, Thu - 14 August 25 -
PAK PM Shahbaz Sharif: భారత్‌పై పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని "చారిత్రాత్మక విజయం"గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి.
Published Date - 05:25 PM, Thu - 14 August 25 -
Btech Ravi : పులివెందులల్లో టీడీపీ గెలుపు.. ప్రజల ధైర్యం, విశ్వాసానికి ప్రతిఫలం : బీటెక్ రవి
ఇప్పుడు ఆ భయాలను తొలగించి ధైర్యంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని ఆయన వ్యాఖ్యానించారు. మునుపటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలను అడ్డుకున్న దుర్మార్గాలను మేము గుర్తు చేసుకుంటే, ఈసారి పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేశారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం అని బీటెక్ రవి పేర్కొన్నారు.
Published Date - 12:14 PM, Thu - 14 August 25 -
Pulivendula : పులివెందులలో సంచలనం..నాలుగు దశాబ్దాల వైఎస్ కంచుకోట పై టీడీపీ జెండా
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్వగ్రామమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం రాజకీయంగా అపూర్వ ఘటనగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 11:16 AM, Thu - 14 August 25 -
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్‌ను ఒకే రౌండ్‌లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 14 August 25 -
Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
Published Date - 08:24 PM, Wed - 13 August 25 -
MLC post : కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వం కొత్తగా నామినేట్ చేసే వ్యక్తుల నియామకాలు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయి అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.
Published Date - 05:28 PM, Wed - 13 August 25 -
Heavy rains : నేడు, రేపు తెలంగాణ అంతటికీ రెడ్ అలర్ట్ : వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న
రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాద సూచక హెచ్చరిక), మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ (మోస్తరు ప్రమాద హెచ్చరిక), మరో భాగాలకు ఎల్లో (ప్రారంభ హెచ్చరిక) జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గారు వెల్లడించారు.
Published Date - 01:58 PM, Wed - 13 August 25 -
Hyd Rains : హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్
Hyd Rains : హైదరాబాద్‌లో గత కొన్ని గంటల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా అన్ని ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 01:35 PM, Wed - 13 August 25 -
HYD : ఇన్‌స్టాలో పరిచయం.. బాలికపై అత్యాచారం
HYD : హైదరాబాద్‌లో మరోసారి సోషల్ మీడియాలో పరిచయం క్రూరకృత్యానికి దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికను ఆకర్షించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 10:35 AM, Wed - 13 August 25 -
Telangana : తెలంగాణలో అతి భారీ వర్షాలు …నీటిపారుదల శాఖ అధికారులకు అప్రమత్తత ఆదేశం!
రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు, చెరువులు, ట్యాంకులపై 24 గంటల నిఘా కొనసాగించాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని నీటిపారుదల శాఖ అధికారుల సెలవులు తక్షణం నుండి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published Date - 09:23 AM, Wed - 13 August 25 -
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచారణకు మంచు లక్ష్మి!
ఈ ప్రమోషన్ల ద్వారా వారికి అక్రమంగా డబ్బులు అందాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించనున్నారు.
Published Date - 10:16 PM, Tue - 12 August 25 -
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
Published Date - 09:51 PM, Tue - 12 August 25