Winter : ఈసారి మరింత వణికిపోతారు – నిపుణులు
Winter : ఈ శీతాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ (ENSO) సైకిల్‌లోని శీతల దశ అయిన లానినో, భూమధ్య రేఖ పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది
- By Sudheer Published Date - 09:18 AM, Mon - 15 September 25

లానినో కారణంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ (ENSO) సైకిల్‌లోని శీతల దశ అయిన లానినో, భూమధ్య రేఖ పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది.
Health Tips: పాలతో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే డేంజర్!
లానినో ప్రభావం వల్ల భారతదేశంలో చలిగాలుల తీవ్రత పెరిగి, సాధారణం కంటే ఎక్కువ చలిని ప్రజలు అనుభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని, కానీ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ చలి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు వెచ్చని దుస్తులు, గదులను వెచ్చగా ఉంచుకునే సాధనాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
సాధారణంగా లానినో దశ తర్వాత అధిక వర్షపాతం, శీతల వాతావరణం నెలకొంటుంది. ఈసారి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలోని ఈ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు, చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన పెంచుకోవాలి. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడం, చల్లటి గాలి తగలకుండా చూసుకోవడం, వేడి పదార్థాలు తీసుకోవడం వంటి వాటిని అలవాటు చేసుకోవడం ద్వారా చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.