IND Beat PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన విధానం భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి భారత జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
- By Gopichand Published Date - 11:30 PM, Sun - 14 September 25

IND Beat PAK: ఆపరేషన్ సిందూర్ తర్వాత దుబాయ్ మైదానంలో కూడా టీమ్ ఇండియా పాకిస్తాన్ (IND Beat PAK)ను చిత్తు చేసింది. ఆసియా కప్ 2025లో జరిగిన ఆరో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్ల ముందు తలవంచారు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని టీమ్ ఇండియా సునాయాసంగా కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టీమ్ ఇండియా అద్భుత విజయం
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభం అంత బాగా లేదు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ముందుకు నడిపించాడు. అభిషేక్ కేవలం 13 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
Also Read: Pakistan: భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అవమానం.. వీడియో వైరల్!
దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు సూపర్-4లో దాదాపుగా తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. వివాదాస్పదంగా మారిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ గెలుపుకు చేరువగా కనిపించలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 127 పరుగులు మాత్రమే చేయగా, భారత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ధోనీని గుర్తుకు తెచ్చిన సూర్య ఫినిషింగ్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన విధానం భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి భారత జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్ ఏ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌లలో 4 పాయింట్లు సాధించి సూపర్-4లో దాదాపుగా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు పాకిస్తాన్‌కు ఇప్పటికీ 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ దశలో ఆ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది.