Speed News
-
Indigo : భారీ ప్రమాదం తప్పింది.. గాల్లోనే ఇంజిన్ ఆగిపోయిన ఇండిగో విమానం
Indigo : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే, విమాన ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే, సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.
Date : 28-08-2025 - 4:51 IST -
KTR : భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వరదల వల్ల పంట నష్టం, ఇళ్లకు, ఆస్తులకు జరిగిన హానిపై ఆయా ప్రాంతాల ప్రజల నుండి సమాచారం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యోచనతో ఆయన పర్యటన చేపట్టారు.
Date : 28-08-2025 - 3:56 IST -
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Date : 28-08-2025 - 2:56 IST -
Vaishno Devi Landslide : వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు.. 35 మంది మృతి
Vaishno Devi Landslide : జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం మార్గం వద్ద చోటుచేసుకున్న భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
Date : 28-08-2025 - 12:15 IST -
Telangana : కుండపోత వర్షాలు..వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Date : 28-08-2025 - 11:55 IST -
Viral : 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Viral : ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, వైద్య సర్జరీలు వంటి కారణాలతో చాలామంది రెండు కంటే ఎక్కువ మందిని కనలేని పరిస్థితులు ఉన్నాయి.
Date : 28-08-2025 - 11:25 IST -
KCR : కేటీఆర్ కు కేసీఆర్ ఫోన్… కీలక ఆదేశాలు
KCR : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 28-08-2025 - 10:03 IST -
Pakistan: పాకిస్థాన్‌కు భారత్ సాయం.. 1,50,000 మంది పాకిస్థానీలు సేఫ్!
సోమవారం భారత్ దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్‌కు వరద హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని నెలల్లో ఈ రెండు దేశాల మధ్య ఇది మొదటి ప్రత్యక్ష సంప్రదింపు.
Date : 27-08-2025 - 9:54 IST -
Red Warning: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్!
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Date : 27-08-2025 - 5:26 IST -
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Date : 27-08-2025 - 4:43 IST -
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ -10 ఫోన్.. సిగ్నల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్
Google Pixel 10 : టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం, గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10'ను విడుదల చేసింది.
Date : 27-08-2025 - 4:12 IST -
Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
Date : 27-08-2025 - 3:29 IST -
Trump : కంపుకొడుతున్న ట్రంప్ మాటలు.. మోదీని బెదిరించానంటూ..!
Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికెళ్లినా ఒకే మాట చెబుతూనే ఉంటారు—“ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆరు ప్రధాన యుద్ధాలను నేను ఆపాను” అని. వాటిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం కూడా ఉందంటూ పదే పదే వాఖ్యలు చేస్తున్నారు.
Date : 27-08-2025 - 2:10 IST -
R.Ashwin: ఐపీఎల్‌కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై.. 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు.!
R.Ashwin: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులకు షాకిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని నెలల్లోనే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు బుధవారం ప్రకటించారు.
Date : 27-08-2025 - 1:41 IST -
Heavy Rain : గణేష్ పండగ పనులకు ఆటంకం
Heavy Rain : పండుగ రోజునైనా వర్షాలు తగ్గుముఖం పడితే, పండుగ సన్నాహాలు సక్రమంగా పూర్తి చేసుకొని, ఆనందంగా పండుగను జరుపుకోవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు.
Date : 27-08-2025 - 12:15 IST -
Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు
పలు వాహనాలు, వ్యక్తులు కొండచరియల కింద నలిగిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగంగా ప్రారంభించాయి. ఇప్పటి వరకు అనేకమందిని బతికించి బయటకు తీసినట్లు, కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
Date : 27-08-2025 - 10:29 IST -
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం స్పష్టంగా తెలంగాణపై పడనుండటంతో మంగళవారం, బుధవారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
Date : 26-08-2025 - 6:38 IST -
TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.
Date : 26-08-2025 - 6:03 IST -
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించగా, మరో 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు.
Date : 26-08-2025 - 4:16 IST -
Raging : శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ ..ఐరన్ బాక్స్‌తో కాల్చిన తోటి విద్యార్థులు
Raging : 10వ తరగతి చదువుతున్న గుర్రం విన్సెంట్ అనే విద్యార్థిపై అతని సహచర విద్యార్థులే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విన్సెంట్‌ను స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు
Date : 26-08-2025 - 2:31 IST