Mirai Collections: ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత అదే రికార్డ్ తేజ సజ్జా ఖాతాలో! ‘మిరాయ్’ కలెక్షన్ల హవా
బ్యాక్ టు బ్యాక్ ఈ రేర్ ఫీట్‌ను సాధించిన తేజ, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన చేరిపోయారు.
- By Dinesh Akula Published Date - 02:46 PM, Sun - 21 September 25

హైదరాబాద్: (Tej Sajja)టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా, తన తాజా సినిమా *‘మిరాయ్’*తో ఓ సెన్సేషనల్ రికార్డు సృష్టించారు. ‘హనుమాన్’ తర్వాత ఈ చిత్రంతో మరోసారి ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వరుసగా రెండు సినిమాలతో ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను తాకిన మూడో హీరోగా తేజ సజ్జా రికార్డుల్లో నిలిచారు.
సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ మొదటి వారం లోపే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఇప్పటివరకు రూ. 112 కోట్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోను ఫస్ట్ డే నుంచే ఫుల్ హౌస్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు విదేశాల్లో $2.5 మిలియన్‌కి పైగా వసూలు చేసి, తేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
ఇంతకు ముందు ఆయన నటించిన హనుమాన్ కూడా ఓవర్సీస్‌లో ఇదే మార్క్‌ను టచ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ ఈ రేర్ ఫీట్‌ను సాధించిన తేజ, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన చేరిపోయారు.
#Superyodha continues his unstoppable journey at the US box-office! 🥷💥
$𝟮.𝟱 𝗠𝗜𝗟𝗟𝗜𝗢𝗡 for #MIRAI in North America with Unanimous Love & Reception ❤️🤩#BrahmandBlockbusterMirai racing towards $3MILLION+ mark ❤️🔥
Overseas by @ShlokaEnts @peoplecinemas
Superhero… pic.twitter.com/jBPWbPiWL1
— People Media Factory (@peoplemediafcy) September 21, 2025
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై, పాజిటివ్ మౌత్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో తేజా సజ్జా, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించగా, మంచు మనోజ్ విలన్‌గా నటించారు. శ్రియ శరణ్, జగపతి బాబు, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా స్వయంగా చేపట్టగా, గౌర హరి సంగీతం అందించారు. ఈ విజయంతో తేజ సజ్జా టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవల్ యంగ్ స్టార్‌గా గుర్తింపు పొందారు.