BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా
- By Balu J Published Date - 12:01 PM, Tue - 28 December 21

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఆస్పత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.