India: మోడీ కొత్త కారు విలువ 12కోట్లు
- Author : hashtagu
Date : 28-12-2021 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయో గించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాయ్ వాలాగా చెప్పుకునే మోడీ ఇంతవరకు ఏ ప్రధాని వాడని బ్రాండ్స్ వాడేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన మేబాష్ సన్ గ్లాసెస్ కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా, మోదీ వాడుతున్న12 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ మేబాష్ ఎస్ 650 కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చినపుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోదీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య మోదీ కాన్వాయ్‌లో మరోసారి ఈ వాహనం కనిపించింది. 24 కోట్లతో రెండు కార్లు కొన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 800 కోట్లు వెచ్చించి అని సౌకర్యాలు గల విమానం మోడీ తీసుకోబోతున్నారు.