Politics: వంగవీటి రాధకు 2+2 సెక్యూరిటీ
- Author : hashtagu
Date : 28-12-2021 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో వంగ వీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. తనను చంపాలని కొందరు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పాడు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాంతో కొడాలి నాని సోమవారం సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితిని వివరించారు. దాంతో స్పందించిన సీఎం జగన్ వెంటనే 2+2 కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించారు. అలాగే రెక్కీ ఎవరు నిర్వహించారో తేల్చాలని ఇంటిలిజెన్స్ డీజీని సీఎం కోరారు. రాధాకు ఎవరి మీదనైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వానికి తెలపాలని, ప్రభుత్వం ఆయనకు అన్ని విధాల అండగా ఉంటుందని కొడాలి నాని ప్రెస్ మీట్ లో తెలిపారు. ఎవరికి ప్రాణ భయం ఉన్నా ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఎవరైనా రాధా పై ఇలాంటి ప్రయత్నాలు చేయాలనే ఆలోచన ఉండి ఉంటె వెంటనే మానుకోవాలని నాని హెచ్చరించారు.