Modi: కాన్పూర్ లో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులు ప్రారంభం
- By Balu J Published Date - 11:53 AM, Tue - 28 December 21
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పర్యటించనున్నారు. ఐఐటీ-కాన్పూర్ 54వ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరవుతారు. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టులో ఇప్పటి దాకా పూర్తయిన భాగాన్ని ప్రారంభిస్తారు. ‘బినా-పంకి’ బహుళ ఉత్పత్తుల పైప్లైన్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టు పనులపై తనిఖీ నిమిత్తం ప్రధానమంత్రి ఐఐటీ మెట్రో స్టేషన్ నుంచి గీతానగర్ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. ఈ మెట్రోరైల్ ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కిలోమీటర్లు కాగా, 11 వేల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు.
Tags
Related News
DSP Krupakar : తిరుమలలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం
మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర అస్వస్థతకు గురై.. గుండెలో నొప్పి రావడం