Hyd:మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు వైన్స్ షాపులు!
న్యూఇయర్ వేల మందుబాబులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది.
- By Hashtag U Published Date - 08:49 PM, Tue - 28 December 21

న్యూఇయర్ వేల మందుబాబులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. రెంట్లు, పబ్బులు, హోటళ్లు సహా మద్యం అందించే షాపులన్నీ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. మద్యం షాపులను 1 గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతిని ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈవెంట్ల నిర్వహణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ తాత్కాలిక లైసెన్స్ ను అందించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్యను బట్టి ఎక్సైజ్ అధికారులు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేయనున్నారు.