Rajamouli: సుక్కు, చరణ్ సినిమా ‘ఓపెనింగ్’ సీక్వెన్స్ నాకు తెలుసు!
రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మళ్లీ ఒక్కటవుతున్నారు.
- By Balu J Published Date - 03:59 PM, Tue - 28 December 21

రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మళ్లీ ఒక్కటవుతున్నారు. ఈ చిత్రంలో చరణ్ ‘చిట్టి బాబు’ అనే రియలిస్టిక్ క్యారెక్టర్‌ని పోషించాడు. మళ్లీ వాళ్లిద్దరి కలయికలో మరో మూవీ రాబోతోంది. “నేను రంగస్థలం సినిమా చేస్తున్నప్పుడే మళ్లీ సినిమా చేయాలని అనుకున్నాం. అతనితో పనిచేయడం చాలా ఆనందించాను, అందుకే ఫైనల్ రిజల్ట్ అలా వచ్చింది. సుక్కుతో మళ్లీ పని చేయడానికి ఇష్టపడతాను” అని రామ్ చరణ్ అన్నారు.
ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్, చరణ్ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు తెలుసు, నేను రివీల్ చేయను. చేస్తే సుకుమార్‌కి గుండెపోటు వస్తుంది. చాలా కష్టతరమైన సన్నివేశాలలో సుకుమార్, చరణ్ సినిమా ప్రారంభ సన్నివేశాన్ని చూసినప్పుడు ప్రేక్షకులు వణుకుతారని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో మగధీర్, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశానని, ఆయన కారణంగా నేను పాన్ ఇండియా హీరోగా మారానని, బడ్జెట్స్ కూడా నిర్మాతలకు సౌకర్యంగా మారిందని, అందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్పాలని చరణ్ అభిప్రాయపడ్డారు.