Andhra Pradesh: పీఆర్‌సీపై జగన్ సమీక్ష
- By hashtagu Published Date - 04:29 PM, Tue - 28 December 21

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఇటీవల సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాల అసంతృప్తితో ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు తెలిపిన అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి కమిటీ సభ్యులు తీసుకెళ్లనున్నారు.