Allu Arjun : సుక్కు లేకపోతే నేను లేను!
- By Balu J Published Date - 05:36 PM, Tue - 28 December 21

తెలుగు తెరపై కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ అనగానే సుక్కు, బన్నీ కాంబో గుర్తుకువస్తుంది. వాళిద్దరి కలయికలో ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు హ్యాట్రిక్ కొట్టాయి. ఆర్య సినిమా నుంచే వీళ్లదరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటారు. తాజాగా పుష్ప థాంక్యూ మీట్ జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. హీరోగా నిలబడేందుకు సుక్కు సహకారం అందించాడని, సుక్కు లేకపోతే ఈ బన్నీ లేడని కంటతడి పెట్టుకున్నాడు. సుకుమార్ కూడా ఎమోషనై కన్నీరు పెట్టుకున్నారు.