Vangaveeti: అభిమానులు, అనుచరులే తనకు రక్షణ
ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే గత రెండురోజులుగా వంగవీటి రాధా చుట్టే తిరుగుతున్నాయి.
- By Hashtag U Published Date - 08:56 PM, Tue - 28 December 21

ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే గత రెండురోజులుగా వంగవీటి రాధా చుట్టే తిరుగుతున్నాయి. ఆయన హత్యకు రెక్కీ జరిగిందనీ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయమై ఏపీ డీజేపీ కూడా స్పందించారు. రాధా వ్యాఖ్యలను సీఎం జగన్ ను దృష్టికి తీసుకెళ్లగా, 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయమై వంగవీటి స్పందించారు. తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని, ప్రభుత్వ గన్ మన్లు వద్దని చెప్పానని వెల్లడించారు. అభిమానులు, అనుచరులే తనకు రక్షణ అని స్పష్టం చేశారు.