New Josh: ‘31st’ సెలబ్రేట్ చేసుకోవాలా.. వద్దా..?
డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఒకర్ని ఒకరు పలకరించుకుంటే చాలు 31st ప్లాన్స్ ఏంటి? ఎక్కడ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అనే చర్చ తప్పకుండ ఉంటుంది. అయితే సెలెబ్రేషన్ అనే కాన్సెప్ట్ పై ఫిలాసఫర్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 01:07 PM, Fri - 31 December 21
డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఒకర్ని ఒకరు పలకరించుకుంటే చాలు 31st ప్లాన్స్ ఏంటి? ఎక్కడ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అనే చర్చ తప్పకుండ ఉంటుంది. అయితే సెలెబ్రేషన్ అనే కాన్సెప్ట్ పై ఫిలాసఫర్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏదైనా సాధించినప్పుడు మాత్రమే సెలెబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని కొందరు, జీవితంలో ప్రతి మూమెంట్ సెలెబ్రేట్ చేసుకోవాలని కొందరు తమ అభిప్రాయాలని చెప్పారు.
మనలో చాలామంది తమ పుట్టినరోజులని సెలెబ్రేట్ చేసుకుంటారు. కొందరైతే చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. అయితే మన పుట్టినరోజు కేవలం ఒక డేట్ మాత్రమేనని, దానికి సెలెబ్రేట్ చేసుకోవాల్సినంత గొప్పతననేమి ఉండదని కొందరు అంటారు. పుట్టినరోజు నాడు మన జీవితాలని రివ్యూ చేసుకొని మనం చేయాల్సిన పనులు ఏవేవి చేయలేకపోయాము, దానికి గల కారణాలు ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని, మన జీవితంలో ఇంకొన్ని రోజులు పోయాయని అనుకోవాలని ఫ్రెడరిక్ నిషే లాంటి ఫిలాసఫర్స్ చెప్పారు. మనం పుట్టి ఈ లోకంలోకి వచ్చిన రోజుని తప్పకుండా సెలెబ్రేట్ చేసుకోవాలని, కనీసం మన జీవితాల్లోని ముఖ్యమైన రోజుల్లోనైనా ఎలాంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉండేలా మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉపయోగపడుతాయని ఇంకొందరి వాదన.
మన జీవితాల్లోని ముఖ్యమైన రోజులు మన తప్పులని సరిదిద్దుకోవడానికి, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకోవాలని కొందరు ఫిలాసఫర్స్ చెప్తారు. మన జీవితాల్లో మనకి ఇష్టం లేకపోయినా ఎదో ఒకదశలో సెలెబ్రేట్ చేసుకోవాల్సి వచ్చే రోజు ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా న్యూ ఈయర్ అని చెప్పొచ్చు. మన జీవితంలోని ఎదో ఒక దశలో మన పక్కన ఉండే సర్కిల్ కోసమైనా మనం న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో అందరూ కలిసి మన జీవితంపై ఒక రివ్యూ చేసుకొని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే అవకాశంగా చూడాలని కొందరు సూచిస్తున్నారు.
కొందరు మాత్రం న్యూ ఈయర్ సెలెబ్రేషన్ కేవలం తాగడానికి వచ్చిన ఓ రోజుగానే ట్రీట్ చేస్తారు. ఆరోజు ఎంత తాగితే అంత హ్యాపీగా ఉన్నట్టు లెక్క కడుతారు. ఆరోజు ఏమేం తాగాలో ఎంత తాగాలో ప్లాన్స్ వేసుకుంటారు. కొందరైతే న్యూ ఈయర్ సెలబ్రేషన్ లో తాగడానికి మాత్రమే గోవా, పాండిచ్చేరి, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాలకు, మరొకొందరు విదేశాలకు వెళ్తుంటారు. చాలామంది యూత్, ముఖ్యంగా కాలేజీ పిల్లల విషయంలో తమ బ్యాడ్ హ్యాబిట్స్ మొదలుపెట్టడానికి కారణమయ్యే రోజుగా న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ కారమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. న్యూ ఈయర్ ని అర్ధవంతంగా చేసుకుంటేనే మనకు మనం గౌరవం ఇచ్చుకున్నట్లు ఉంటుందని కొందరి అభిప్రాయం. మన లైఫ్ లోని తప్పొప్పులను సరిచేసుకోవడానికి న్యూ ఈయర్ ని ఒక వేదికగా చేసుకోవాలని, మనం చేయలేకపోయిన పనులకు కారణాలు వెతికి, చేయాల్సిన పనులకు దిశానిర్దేశం చేసుకుంటే న్యూ ఈయర్ అద్భుతంగా చేసుకున్నట్టు. జీవితంలో ఏదైనా సాధించినప్పుడు సెలెబ్రేషన్ చేసుకుంటే అది మనకి మోటివేషన్ గా, మన చుట్టూ ఉన్నవాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందట.
మనలోని తప్పొప్పులని సరిదిద్దుకోవడానికి, జీవితంలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన రెజల్యూషన్స్ తీసుకోవడానికి న్యూ ఈయర్ వేదిక అయితే అదే అర్థవంతమైన న్యూ ఈయర్ గా నిలుస్తుంది. ఇప్పటికైనా మీ జీవితాలకు సంబందించిన మంచి నిర్ణయాలను తీసుకుని వాటిని అచీవ్ చేసే మార్గాన్ని టార్గెట్ గా పెట్టుకోండి. ఇది చదివి మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి మా తరపున ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ న్యూ ఈయర్.
Related News
Lord Shiva: అరుణాచలం శివుడి ప్రత్యేకత ఎంటో తెలుసా.. చారిత్రక నేపథ్యం ఇదే
Lord Shiva: ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది. పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు “మీ నుండి ఇంత �