Karnataka: హిందూ దేవాయాలకు స్వయంప్రతిపత్తి
- By hashtagu Published Date - 05:24 PM, Fri - 31 December 21

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్రభుత్వ పరిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా, ఎగువ సభలో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణలను తీసివేయాలని డిమాండ్లు వస్తున్న విషయం విదితమే. ఆ డిమాండ్ ను తొలుత కర్ణాటక ప్రభుత్వం పరిష్కారం చేసింది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఆ రాష్ట్రం సీఎం బసవరాజ్ బొమ్మై నిర్ణయం తీసుకున్నాడు.
“ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను రక్షించడానికి మరియు వారికి పరిపాలనా స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కానీ హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ అనుమతి మేరకు ఆలయాల సొంత నిధులను ఖర్చుపెడుతుంటారు. ఆ క్రమంలో భక్తుల నిధులను దుర్వినియోగం కావడంతో పాటు హిందూ దేవాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది.
కర్ణాటకలో 34,563 హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. శాఖ పరిధిలోని 34,563 ఆలయాల్లో 207 ఆలయాలు ‘ఎ’ కేటగిరీకి చెందినవి కాగా, వార్షిక ఆదాయం రూ.25 లక్షలకు మించి ఉండగా, 139 ఆలయాలు ‘బి’ కేటగిరీలో, రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఆదాయం కలిగి ఉండగా, 34,217 ఆలయాలు ఉన్నాయి. రూ. 5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయంతో ‘సి’ కేటగిరీలో ఉన్నాయి. వీటన్నింటికీ స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలులోకి కర్ణాటక ప్రభుత్వం తీసుకురానుంది.